Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): దేవరకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆయన నిరంతరం ప్రజ అందుబాటులో ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వ్యవసాయం, వ్యాపార రంగాలతో పాటు గ్రాడ్యుయేట్ విద్యా అర్హత కలిగిన బాలు నాయక్, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్య మరియు వైద్య రంగాల అభివృద్ధికి అధికారులతో, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ, దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తన ప్రధాన ధ్యేయమని బాలు నాయక్ స్పష్టం చేస్తున్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ): పేద, అనాథ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ తాటికోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన ‘యూత్ ఫర్ సేవా’ సేవా సంస్థ సౌజన్యంతో పాఠశాలలోని అనాథ, పేద విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, జామెట్రీ బాక్సులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులుగా జె. బక్కయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించి వారి చదువుకు ఆసరాగా నిలిచిన ‘యూత్ ఫర్ సేవా’ సంస్థకు ప్రధానోపాధ్యాయులు జె. బక్కయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/దేవరకొండ, ఆగస్టు 7): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/దేవరకొండ, ఆగస్టు 7): మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరీకుంట తండా, గుడితండా గ్రామాల్లో చెరో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాఖ్య భవనాలు అందుబాటులోకి రావడంతో సంఘ సమావేశాలు, పొదుపు-రుణాల నిర్వహణ, లెక్కల పర్యవేక్షణ, శిక్షణా కార్యక్రమాలు మరియు స్వయం ఉపాధి ప్రణాళికలను ఒకే చోట సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సున్నా వడ్డీ రుణాలు, బ్యాంకు లింకేజీలు మరియు ఉపాధి శిక్షణల ద్వారా గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ఉపాధి, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాల కోసం ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక బస్సును త్వరలోనే మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కొండమల్లేపల్లి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భూతరాజు ప్రేమలత, ఏపీఎం యాదయ్య, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్, ఆగస్టు 7): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల యజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండటంతో వారి విద్యాభ్యాసం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు చెరుకు శివరాజ్, విద్యార్థి జన సమితి కార్యదర్శి మాలోత్ రవి కుమార్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలు రాయలేక, సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత విద్య కొనసాగింపులో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ): ఉస్మానియా యూనివర్సిటీ లోని ప్రసిద్ధ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ పిలుపు మేరకు, ఓయూ అధ్యక్షుడు చెరుకు శివరాజ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, భావజాల వ్యాప్తిలోనూ జయశంకర్ సార్ పోషించిన పాత్ర స్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, జంగిలి దర్శన్, విద్యార్థి జన సమితి నాయకుడు శివతో పాటు పలువురు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
♦ ఆజీంపేట బట్ట లింగయ్య హత్య కేసులో కీలక పరిణామం♦ జీవితకాల శిక్షపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే.. బెయిల్ మంజూరు♦ నాటి టిఆర్‌ఎస్ దుర్మార్గ పాలనలోనే కుట్రపూరితంగా ఇరికించారు: కాంగ్రెస్ నేతల ఆరోపణ♦ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వీడని జైలు నీడ.. సుప్రీం తీర్పుతో రీ-ఎంట్రీ!♦ దశాబ్దకాల రాజకీయ ప్రయాణం – ప్రతిపక్షంలో పోరాటం♦ అడ్డగూడూరు, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజంప్రజాయుద్ధనౌక ప్రతినిధి (అడ్డగూడూరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు మండలంలో గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆజీంపేట బట్ట లింగయ్య హత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అప్పటి సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకుడు పోలెబోయిన లింగయ్యకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు విధించిన యావజ్జీవ (జీవితకాల) శిక్ష అమలుపై ధర్మాసనం తాత్కాలికంగా స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయనను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వార్త తెలియగానే అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానుల్లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 2017వ సంవత్సరం దసరా పండుగ రోజున అడ్డగూడూరు మండలం ఆజీంపేట గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికంగా తీవ్ర రాజకీయ, సామాజిక అలజడి రేపిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు సమగ్ర విచారణ జరిపి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలెబోయిన లింగయ్యతో పాటు పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పండుగ నర్సింహ, పండుగ సతీష్, పండుగ శ్రీకాంత్, జక్కుల బిక్షమయ్యలు నిందితులుగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం జిల్లా కోర్టు వీరికి యావజ్జీవ శిక్ష విధించింది. విచారణలోనే జక్కుల బిక్షమయ్య మృతి చెందగా, మిగతా 17 మంది చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, పండుగ లచ్చయ్య తన కుమార్తె వివాహం కోసం, పండుగ సత్యనారాయణ తన భార్య అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు బెయిల్ పొంది ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. నేరం జరిగిన సమయంలో మరియు ఆ దాడిలో పిటిషనర్ పోలెబోయిన లింగయ్య ప్రత్యక్షంగా పాల్గొనలేదని, ఫిర్యాదులో కూడా ఆయన స్వయంగా దాడి చేసినట్లు ఎలాంటి ఆరోపణలు లేకపోవడాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. దాడిలో ప్రత్యక్ష ప్రమేయం లేకపోవడాన్ని గుర్తించిన ధర్మాసనం, కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను తాత్కాలికంగా పక్కన పెడుతూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశంతో ఐదేళ్లకు పైగా సాగుతున్న న్యాయపోరాటంలో పోలెబోయిన లింగయ్యకు అతిపెద్ద ఊరట లభించింది. పోలెబోయిన లింగయ్య గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆజీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో మండలం, నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్‌ను సమాయత్తం చేసి, తుంగతుర్తి శాసనసభ్యుడిగా మందుల సామేల్, భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిలు భారీ మెజార్టీతో గెలవడంలో ప్రధాన భూమిక పోషించారు. అయితే, 10 సంవత్సరాల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను కష్టపడి గెలిపించిన నాయకులు పదవులు చేపట్టిన కొద్ది రోజులకే శిక్ష అమలై జైలు పాలవ్వడంతో లింగయ్య తీవ్ర నిరాశకు, మానసిక వేదనకు గురయ్యారు. దీంతో తన గ్రామంతో పాటు మండలవ్యాప్తంగా ఆయన క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురై, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పెరోల్‌పై విడుదలైన సమయంలో ఆయన తన కుమారుని వివాహం జరిపించి మళ్లీ జైలుకు వెళ్లారు. అలాగే గత డిసెంబర్‌లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపినప్పటికీ ఓటమి ఎదురైంది. చేయని నేరానికి జైలు పాలు చేశారు.. చివరకు సత్యమే గెలిచింది: ఆజీంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మగాని సైదులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంపై ఆజీంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మగాని సైదులు స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. "అప్పటి టిఆర్‌ఎస్ దుర్మార్గ పాలనలో మా నాయకుడు పోలెబోయిన లింగయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య కేసులో ఇరికించి చేయని నేరానికి జైలు పాలు చేశారని. లింగయ్యకు ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోయిన నాటి అధికార పార్టీ నాయకులు కుట్ర పూరితంగానే ఈ కేసు నమోదు చేయించారన్నారు. నిరపరాధి అయిన లింగయ్య జైలు శిక్ష అనుభవిస్తూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారన్నారు, హత్యలో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో అప్పటి ప్రభుత్వ దుర్మార్గపు కుట్రలు బట్టబయలయ్యాయని, చివరకు సత్యమే గెలిచింది" అని పేర్కొన్నారు. ఇప్పుడు పోలెబోయిన లింగయ్య జైలు నుండి విడుదలవుతున్నారనే వార్త తెలియగానే ఆయన క్యాడర్‌లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. లింగయ్య రాకతో ఆజీంపేట గ్రామంలోనూ, మండల, నియోజకవర్గ, జిల్లా రాజకీయ వర్గాల్లోనూ మళ్లీ కొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి.
సత్యం వైపు సాగే నీ అడుగు,నిజాయితీకి నిలువెత్తు రూపు...మీడియా జగత్తులో చెరగని ముద్ర,వార్తల లోకంలో నీవో శోధనల సముద్ర!'మీడియా పోస్టర్ న్యూస్' కలల బాటలో,విజయకేతనం ఎగరేసిన నేర్పరివి...కష్టాన్నే నమ్ముకున్న యోధుడివై,అందరి మనసు గెలిచిన స్నేహశీలివి!మిత్రమా వరప్రసాద్...నీ ఆశయాలు నింగినంటాలని,నీ అడుగులు మరింత ఎత్తుకి సాగాలని...ఆయురారోగ్యాలు, నిండైన సుఖ సంతోషాలతోనూరేళ్లూ నీవు వర్ధిల్లాలని...మనస్ఫూర్తిగా కోరుకుంటూ... పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రమా! 💐✨ - ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️
»»» మృతురాలి కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం»»» ఆపద సమయంలో అండగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్‌కు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపిన మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (కేతెపల్లి/నల్లగొండ): కేతెపల్లి మండలం చేరకుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌లోని పవన్ సాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన పోకల నవనీత కుటుంబాన్ని బుధవారం పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త పోకల మోహన్ రావుని, వారి ముగ్గురు చిన్న పిల్లలను కలసి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తన మానవతా దృక్పథాన్ని చాటుతూ మృతురాలి కుటుంబానికి రూ. 10,000/- (పది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి మృతురాలి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.