Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

ఆజీంపేట హత్య కేసులో.. ప్రత్యక్ష దాడిలో ప్రమేయం లేదని గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం-జైలు నుండి విడుదలకానున్న మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య

ప్రతినిధి: యాదాద్రి భువనగిరి
ప్రచురణ: 07 Aug 2026 04:46 AM
వీక్షణలు: 1,576 Views
ఆజీంపేట హత్య కేసులో..  ప్రత్యక్ష దాడిలో ప్రమేయం లేదని గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం-జైలు నుండి విడుదలకానున్న మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య

♦ ఆజీంపేట బట్ట లింగయ్య హత్య కేసులో కీలక పరిణామం

జీవితకాల శిక్షపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే.. బెయిల్ మంజూరు

♦ నాటి టిఆర్‌ఎస్ దుర్మార్గ పాలనలోనే కుట్రపూరితంగా ఇరికించారు: కాంగ్రెస్ నేతల ఆరోపణ

♦ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వీడని జైలు నీడ.. సుప్రీం తీర్పుతో రీ-ఎంట్రీ!

♦ దశాబ్దకాల రాజకీయ ప్రయాణం – ప్రతిపక్షంలో పోరాటం

 అడ్డగూడూరు, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (అడ్డగూడూరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని  అడ్డగూడూరు మండలంలో  గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆజీంపేట బట్ట లింగయ్య హత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అప్పటి సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకుడు పోలెబోయిన లింగయ్యకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు విధించిన యావజ్జీవ (జీవితకాల) శిక్ష అమలుపై ధర్మాసనం తాత్కాలికంగా స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయనను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వార్త తెలియగానే అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానుల్లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.  

 2017వ సంవత్సరం దసరా పండుగ రోజున అడ్డగూడూరు మండలం ఆజీంపేట గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికంగా తీవ్ర రాజకీయ, సామాజిక అలజడి రేపిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు సమగ్ర విచారణ జరిపి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలెబోయిన లింగయ్యతో పాటు పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పండుగ నర్సింహ, పండుగ సతీష్, పండుగ శ్రీకాంత్, జక్కుల బిక్షమయ్యలు నిందితులుగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం జిల్లా కోర్టు వీరికి యావజ్జీవ శిక్ష విధించింది. విచారణలోనే జక్కుల బిక్షమయ్య మృతి చెందగా, మిగతా 17 మంది చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, పండుగ లచ్చయ్య తన కుమార్తె వివాహం కోసం, పండుగ సత్యనారాయణ తన భార్య అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు బెయిల్ పొంది ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు.  

 కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. నేరం జరిగిన సమయంలో మరియు ఆ దాడిలో పిటిషనర్ పోలెబోయిన లింగయ్య ప్రత్యక్షంగా పాల్గొనలేదని, ఫిర్యాదులో కూడా ఆయన స్వయంగా దాడి చేసినట్లు ఎలాంటి ఆరోపణలు లేకపోవడాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. దాడిలో ప్రత్యక్ష ప్రమేయం లేకపోవడాన్ని గుర్తించిన ధర్మాసనం, కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను తాత్కాలికంగా పక్కన పెడుతూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశంతో ఐదేళ్లకు పైగా సాగుతున్న న్యాయపోరాటంలో పోలెబోయిన లింగయ్యకు అతిపెద్ద ఊరట లభించింది.  

 పోలెబోయిన లింగయ్య గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆజీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో మండలం, నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్‌ను సమాయత్తం చేసి, తుంగతుర్తి శాసనసభ్యుడిగా మందుల సామేల్, భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిలు భారీ మెజార్టీతో గెలవడంలో ప్రధాన భూమిక పోషించారు. అయితే, 10 సంవత్సరాల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను కష్టపడి గెలిపించిన నాయకులు పదవులు చేపట్టిన కొద్ది రోజులకే శిక్ష అమలై జైలు పాలవ్వడంతో లింగయ్య తీవ్ర నిరాశకు, మానసిక వేదనకు గురయ్యారు. దీంతో తన గ్రామంతో పాటు మండలవ్యాప్తంగా ఆయన క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురై, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పెరోల్‌పై విడుదలైన సమయంలో ఆయన తన కుమారుని వివాహం జరిపించి మళ్లీ జైలుకు వెళ్లారు. అలాగే గత డిసెంబర్‌లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపినప్పటికీ ఓటమి ఎదురైంది.  

చేయని నేరానికి జైలు పాలు చేశారు.. చివరకు సత్యమే గెలిచింది: ఆజీంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మగాని సైదులు

 సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంపై ఆజీంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మగాని సైదులు స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. "అప్పటి టిఆర్‌ఎస్ దుర్మార్గ పాలనలో మా నాయకుడు పోలెబోయిన లింగయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య కేసులో ఇరికించి చేయని నేరానికి జైలు పాలు చేశారని. లింగయ్యకు ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోయిన నాటి అధికార పార్టీ నాయకులు కుట్ర పూరితంగానే ఈ కేసు నమోదు చేయించారన్నారు. నిరపరాధి అయిన లింగయ్య జైలు శిక్ష అనుభవిస్తూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారన్నారు, హత్యలో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో అప్పటి ప్రభుత్వ దుర్మార్గపు కుట్రలు బట్టబయలయ్యాయని, చివరకు సత్యమే గెలిచింది" అని పేర్కొన్నారు.

 ఇప్పుడు పోలెబోయిన లింగయ్య జైలు నుండి విడుదలవుతున్నారనే వార్త తెలియగానే ఆయన క్యాడర్‌లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. లింగయ్య రాకతో ఆజీంపేట గ్రామంలోనూ, మండల, నియోజకవర్గ, జిల్లా రాజకీయ వర్గాల్లోనూ మళ్లీ కొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
యాదాద్రి భువనగిరి ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ఆజీంపేట హత్య కేసులో.. ప్రత్యక్ష దాడిలో ప్రమేయం లేదని గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం-జైలు నుండి విడుదలకానున్న మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య

news image
అడ్డగూడూరు, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ♦ ఆజీంపేట బట్ట లింగయ్య హత్య కేసులో కీలక పరిణామం♦ జీవితకాల శిక్షపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే.. బెయిల్ మంజూరు♦ నాటి టిఆర్‌ఎస్ దుర్మార్గ పాలనలోనే కుట్రపూరితంగా ఇరికించారు: కాంగ్రెస్ నేతల ఆరోపణ♦ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వీడని జైలు నీడ.. సుప్రీం తీర్పుతో రీ-ఎంట్రీ!♦ దశాబ్దకాల రాజకీయ ప్రయాణం – ప్రతిపక్షంలో పోరాటం♦ అడ్డగూడూరు, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజంప్రజాయుద్ధనౌక ప్రతినిధి (అడ్డగూడూరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని  అడ్డగూడూరు మండలంలో  గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆజీంపేట బట్ట లింగయ్య హత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అప్పటి సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకుడు పోలెబోయిన లింగయ్యకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు విధించిన యావజ్జీవ (జీవితకాల) శిక్ష అమలుపై ధర్మాసనం తాత్కాలికంగా స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయనను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వార్త తెలియగానే అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానుల్లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.   2017వ సంవత్సరం దసరా పండుగ రోజున అడ్డగూడూరు మండలం ఆజీంపేట గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికంగా తీవ్ర రాజకీయ, సామాజిక అలజడి రేపిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు సమగ్ర విచారణ జరిపి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలెబోయిన లింగయ్యతో పాటు పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పండుగ నర్సింహ, పండుగ సతీష్, పండుగ శ్రీకాంత్, జక్కుల బిక్షమయ్యలు నిందితులుగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం జిల్లా కోర్టు వీరికి యావజ్జీవ శిక్ష విధించింది. విచారణలోనే జక్కుల బిక్షమయ్య మృతి చెందగా, మిగతా 17 మంది చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, పండుగ లచ్చయ్య తన కుమార్తె వివాహం కోసం, పండుగ సత్యనారాయణ తన భార్య అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు బెయిల్ పొంది ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు.   కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. నేరం జరిగిన సమయంలో మరియు ఆ దాడిలో పిటిషనర్ పోలెబోయిన లింగయ్య ప్రత్యక్షంగా పాల్గొనలేదని, ఫిర్యాదులో కూడా ఆయన స్వయంగా దాడి చేసినట్లు ఎలాంటి ఆరోపణలు లేకపోవడాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. దాడిలో ప్రత్యక్ష ప్రమేయం లేకపోవడాన్ని గుర్తించిన ధర్మాసనం, కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను తాత్కాలికంగా పక్కన పెడుతూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశంతో ఐదేళ్లకు పైగా సాగుతున్న న్యాయపోరాటంలో పోలెబోయిన లింగయ్యకు అతిపెద్ద ఊరట లభించింది.   పోలెబోయిన లింగయ్య గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆజీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో మండలం, నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్‌ను సమాయత్తం చేసి, తుంగతుర్తి శాసనసభ్యుడిగా మందుల సామేల్, భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిలు భారీ మెజార్టీతో గెలవడంలో ప్రధాన భూమిక పోషించారు. అయితే, 10 సంవత్సరాల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను కష్టపడి గెలిపించిన నాయకులు పదవులు చేపట్టిన కొద్ది రోజులకే శిక్ష అమలై జైలు పాలవ్వడంతో లింగయ్య తీవ్ర నిరాశకు, మానసిక వేదనకు గురయ్యారు. దీంతో తన గ్రామంతో పాటు మండలవ్యాప్తంగా ఆయన క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురై, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పెరోల్‌పై విడుదలైన సమయంలో ఆయన తన కుమారుని వివాహం జరిపించి మళ్లీ జైలుకు వెళ్లారు. అలాగే గత డిసెంబర్‌లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపినప్పటికీ ఓటమి ఎదురైంది.  చేయని నేరానికి జైలు పాలు చేశారు.. చివరకు సత్యమే గెలిచింది: ఆజీంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మగాని సైదులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంపై ఆజీంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మగాని సైదులు స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. "అప్పటి టిఆర్‌ఎస్ దుర్మార్గ పాలనలో మా నాయకుడు పోలెబోయిన లింగయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య కేసులో ఇరికించి చేయని నేరానికి జైలు పాలు చేశారని. లింగయ్యకు ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోయిన నాటి అధికార పార్టీ నాయకులు కుట్ర పూరితంగానే ఈ కేసు నమోదు చేయించారన్నారు. నిరపరాధి అయిన లింగయ్య జైలు శిక్ష అనుభవిస్తూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారన్నారు, హత్యలో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో అప్పటి ప్రభుత్వ దుర్మార్గపు కుట్రలు బట్టబయలయ్యాయని, చివరకు సత్యమే గెలిచింది" అని పేర్కొన్నారు. ఇప్పుడు పోలెబోయిన లింగయ్య జైలు నుండి విడుదలవుతున్నారనే వార్త తెలియగానే ఆయన క్యాడర్‌లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. లింగయ్య రాకతో ఆజీంపేట గ్రామంలోనూ, మండల, నియోజకవర్గ, జిల్లా రాజకీయ వర్గాల్లోనూ మళ్లీ కొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి.