Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు: రూ.1.40 లక్షల ఆర్థిక సాయం అందజేత

ప్రతినిధి: యాదాద్రి భువనగిరి
ప్రచురణ: 18 Aug 2026 02:33 AM
వీక్షణలు: 129 Views
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు: రూ.1.40 లక్షల ఆర్థిక సాయం అందజేత

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి భువనగిరి/ మోత్కూరు): మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఎలిమినేటి సంతోష్ ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. స్నేహితుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మిత్రులంతా కలిసి రూ.1.40 లక్షల ఆర్థిక సాయాన్ని సేకరించి, సోమవారం సంతోష్ భార్య రజితకు అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. సంతోష్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి తమవంతు బాధ్యతగా ఈ ఆర్థిక సాయం అందించామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంతోష్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
యాదాద్రి భువనగిరి ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు: రూ.1.40 లక్షల ఆర్థిక సాయం అందజేత

news image
యాదాద్రి భువనగిరి, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి భువనగిరి/ మోత్కూరు): మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఎలిమినేటి సంతోష్ ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. స్నేహితుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మిత్రులంతా కలిసి రూ.1.40 లక్షల ఆర్థిక సాయాన్ని సేకరించి, సోమవారం సంతోష్ భార్య రజితకు అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. సంతోష్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి తమవంతు బాధ్యతగా ఈ ఆర్థిక సాయం అందించామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంతోష్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.