నేలతల్లికి మూసీ జలాల స్పర్శ - ఊరి ప్రజలకు పెద్ద మైసమ్మ రక్ష!
నేలతల్లికి మూసీ జలాల స్పర్శ - ఊరి ప్రజలకు పెద్ద మైసమ్మ రక్ష!
అనంతగిరి కొండల్లో ఉదయించిన గంగమ్మ
అలసటే తెలియక సాగివచ్చిన జీవధార
హైదరాబాద్ నగరాన్ని దాటుకుంటూ వచ్చి
మన వెల్దేవి గ్రామ పొలిమేరలను ముద్దాడే వేళ
సోలిపేట ప్రాజెక్టును నిండుకుండలా మార్చి
కృష్ణమ్మ ఒడిలో సంగమించే మూసీ ప్రవాహం!
ఎండిపోని ఊటలతో బోరుబావులు గలగలలాడ
పచ్చని పైర్లతో నేలతల్లి పులకించి మురవగా
కష్టించే రైతన్న కళ్లల్లో వెలుగులు విరియగా
పాడిపంటలు, పశుపక్షాదులు చల్లగా వర్ధిల్లగా
మన ఊరిని కాపాడుతున్న పవిత్ర జలధార!
నేడు మన వెల్దేవి నేలపైన పండుగ శోభ
ఊరి ముత్యాలమ్మ, కరుణించే పెద్ద మైసమ్మల సన్నిధిలో
పసుపుకుంకుమల పరిమళాల పూజల వేళ
వేపకొమ్మల నీడన బోనం నెత్తినెత్తి
డప్పుచప్పుళ్ల నడుమ కదలివచ్చే ఆడపడుచులు!
ఘటాల ఊరేగింపుతో గుడి ప్రాంగణం మురిసిపోగా
భక్తిశ్రద్ధలతో తల్లులకు సమర్పించే నైవేద్యం
చీడపీడలు తొలగి ఊరు చల్లగా ఉండాలని
కరువు కాటకాలు రాకుండా సిరులు కురవాలని
మొక్కులు తీర్చుకుంటూ వేడుకునే శుభవేళ!
అమ్మల దీవెనలతో మన వెల్దేవి గ్రామం మొత్తం
సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలి
ప్రతి ఇంటా విజయాల పంటలు పండాలి!
వెల్దేవి గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు! - ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️