Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
వైద్యం బ్రేకింగ్

తెలంగాణలో దేహదాన విధానాలకు ఒకే రూపు ఇవ్వాలి: డీఎంఈకి TGBODA విజ్ఞప్తి

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 17 Oct 2026 04:56 AM
వీక్షణలు: 85 Views
తెలంగాణలో దేహదాన విధానాలకు ఒకే రూపు ఇవ్వాలి: డీఎంఈకి TGBODA విజ్ఞప్తి

»» వైద్య విద్య, పరిశోధనలకు దేహదానమే ఆధారం.. పది ముఖ్య డిమాండ్లతో వినతి

»» సానుకూలంగా స్పందించిన రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు (DME)

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పార్థివదేహాల (బాడీ డొనేషన్) స్వీకరణకు ఒకే రకమైన ఏకరీతి విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ శరీర అవయవదాతల సంఘం (TGBODA) ప్రభుత్వాన్ని కోరింది. శరీరదానం, అవయవదానాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన పది కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గురువారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ వాణికి అందజేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ కాట్రగడ్డ భారతి, నేషనల్ కోఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస్ తదితరుల నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం డీఎంఈని కలిసింది. సమాజంలో అవయవదానంపై అపోహలు తొలగిపోయి, మరింత మంది ముందుకు వచ్చేలా అధికారిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంఘం ప్రధాన డిమాండ్లు

  • ​ఏకరీతి నిబంధనలు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దేహాలను 24/7 గంటలు గౌరవప్రదంగా స్వీకరించేలా ఒకే విధమైన మార్గదర్శకాలను జారీ చేయాలి.
  • ​పాఠ్యప్రణాళికల్లో బోధన: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే మానవతా విలువలు పెంపొందేలా.. ఇంటర్మీడియట్ నుంచి వైద్య విద్య వరకు దేహ, అవయవదానాల ప్రాముఖ్యతపై పాఠ్యాంశాలు చేర్చాలి.
  • ​అవగాహన కార్యక్రమాలు: విద్యాసంస్థల్లో ప్రత్యేక సెమినార్లు, సదస్సులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి.
  • ​ఆన్‌లైన్ వీలునామా: ప్రభుత్వ వైద్య కళాశాలల వెబ్‌సైట్లలోనే బాడీ డొనేషన్ వీలునామా పత్రాలు సులభంగా లభించేలా డిజిటల్ సదుపాయం కల్పించాలి.
  • ​గౌరవప్రదమైన రవాణా: దాత మరణానంతరం వారి పార్థివదేహాన్ని నివాసం నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ‘మహాప్రస్థానం’ తరహా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి.
  • ​దాతలకు శాశ్వత గుర్తింపు: ఆయా అనాటమీ విభాగాల్లో దాతల పేర్లు, ఫొటోలతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతి ఏటా ‘కాడవర్ డే’ సందర్భంగా వారి కుటుంబాలను సత్కరించాలి.
  • ​అధికారిక దరఖాస్తుల్లో ఆప్షన్: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుల్లోనే దానాభిలాషను తెలిపే ప్రత్యేక కాలమ్ ఉండేలా చూడాలి.
  • ​జీవన్‌దాన్, NOTTO ప్రచారం: ప్రభుత్వ కార్యాలయాల్లో జీవన్‌దాన్, నాటో (NOTTO) వివరాలు, హెల్ప్‌లైన్ నంబర్లను ప్రదర్శించాలి.
  • ​ప్రత్యేక సెలవులు: జీవించి ఉండగా అవయవదానం చేసే కేంద్ర ఉద్యోగుల మాదిరిగానే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 42 రోజుల ప్రత్యేక సెలవులు వర్తింపజేయాలి.
  • ​చట్టం అమలు, కఠిన చర్యలు: అవయవాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను అన్ని శాఖలకు చేరవేయాలి.

​ఈ వినతిపత్రంపై డీఎంఈ డాక్టర్ వాణి సానుకూలంగా స్పందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విధానాలు అమలైతే వైద్య విద్యకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎంతో మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 19-11-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

తెలంగాణలో దేహదాన విధానాలకు ఒకే రూపు ఇవ్వాలి: డీఎంఈకి TGBODA విజ్ఞప్తి

news image
హైదరాబాద్, Nov 19 (ప్రజాయుద్ధనౌక న్యూస్): »» వైద్య విద్య, పరిశోధనలకు దేహదానమే ఆధారం.. పది ముఖ్య డిమాండ్లతో వినతి»» సానుకూలంగా స్పందించిన రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు (DME)ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పార్థివదేహాల (బాడీ డొనేషన్) స్వీకరణకు ఒకే రకమైన ఏకరీతి విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ శరీర అవయవదాతల సంఘం (TGBODA) ప్రభుత్వాన్ని కోరింది. శరీరదానం, అవయవదానాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన పది కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గురువారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ వాణికి అందజేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ కాట్రగడ్డ భారతి, నేషనల్ కోఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస్ తదితరుల నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం డీఎంఈని కలిసింది. సమాజంలో అవయవదానంపై అపోహలు తొలగిపోయి, మరింత మంది ముందుకు వచ్చేలా అధికారిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.సంఘం ప్రధాన డిమాండ్లు ​ఏకరీతి నిబంధనలు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దేహాలను 24/7 గంటలు గౌరవప్రదంగా స్వీకరించేలా ఒకే విధమైన మార్గదర్శకాలను జారీ చేయాలి. ​పాఠ్యప్రణాళికల్లో బోధన: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే మానవతా విలువలు పెంపొందేలా.. ఇంటర్మీడియట్ నుంచి వైద్య విద్య వరకు దేహ, అవయవదానాల ప్రాముఖ్యతపై పాఠ్యాంశాలు చేర్చాలి. ​అవగాహన కార్యక్రమాలు: విద్యాసంస్థల్లో ప్రత్యేక సెమినార్లు, సదస్సులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ​ఆన్‌లైన్ వీలునామా: ప్రభుత్వ వైద్య కళాశాలల వెబ్‌సైట్లలోనే బాడీ డొనేషన్ వీలునామా పత్రాలు సులభంగా లభించేలా డిజిటల్ సదుపాయం కల్పించాలి. ​గౌరవప్రదమైన రవాణా: దాత మరణానంతరం వారి పార్థివదేహాన్ని నివాసం నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ‘మహాప్రస్థానం’ తరహా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి. ​దాతలకు శాశ్వత గుర్తింపు: ఆయా అనాటమీ విభాగాల్లో దాతల పేర్లు, ఫొటోలతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతి ఏటా ‘కాడవర్ డే’ సందర్భంగా వారి కుటుంబాలను సత్కరించాలి. ​అధికారిక దరఖాస్తుల్లో ఆప్షన్: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుల్లోనే దానాభిలాషను తెలిపే ప్రత్యేక కాలమ్ ఉండేలా చూడాలి. ​జీవన్‌దాన్, NOTTO ప్రచారం: ప్రభుత్వ కార్యాలయాల్లో జీవన్‌దాన్, నాటో (NOTTO) వివరాలు, హెల్ప్‌లైన్ నంబర్లను ప్రదర్శించాలి. ​ప్రత్యేక సెలవులు: జీవించి ఉండగా అవయవదానం చేసే కేంద్ర ఉద్యోగుల మాదిరిగానే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 42 రోజుల ప్రత్యేక సెలవులు వర్తింపజేయాలి. ​చట్టం అమలు, కఠిన చర్యలు: అవయవాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను అన్ని శాఖలకు చేరవేయాలి. ​ఈ వినతిపత్రంపై డీఎంఈ డాక్టర్ వాణి సానుకూలంగా స్పందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విధానాలు అమలైతే వైద్య విద్యకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎంతో మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.