Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

రూ.211 కోట్ల మెడికల్ స్కాం.. బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి.. రంగంలోకి ఇంటలిజెన్స్ వర్గాలు.!

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 06 Oct 2026 03:15 AM
వీక్షణలు: 11 Views
రూ.211 కోట్ల మెడికల్ స్కాం.. బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి.. రంగంలోకి ఇంటలిజెన్స్ వర్గాలు.!
(తెలంగాణ):

★ ఏసీబీ కష్టపడి పట్టుకుంటే.. లోపాయికారీగా ఎలా వదిలేస్తారు?

★ నిందితులకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సీఎం తీవ్ర ఆగ్రహం!

హైదరాబాద్ (ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ కుంభకోణం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల గండికొట్టిన ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నాటి జాయింట్ డైరెక్టర్ (జేడీ) పద్మను ఏసీబీ కేసు నుంచి తప్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు రేయింబవళ్లు కష్టపడి ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేస్తే.. ఇలా లోపాయికారీగా నిందితులను ఎలా వదిలేస్తారు? దీనివల్ల సమాజంలోకి, ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుంది? ప్రాసిక్యూషన్ అనుమతులను ఏళ్ల తరబడి ఎందుకు తొక్కిపెడుతున్నారు? అంటూ కార్మిక శాఖ ఉన్నతాధికారుల తీరుపై సీఎం మండిపడ్డారు. ఇప్పటివరకు నమోదైన ఏసీబీ కేసుల్లో ‘యాక్షన్ డ్రాప్’ చేసిన ప్రతి కేసు వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.                        

ఖజానాకు రూ. 211 కోట్ల గండి.. ఈడీ ఆస్తుల జప్తు

2019లో ఈఎస్ఐ ఆసుపత్రులకు అత్యవసర మందుల సరఫరా పేరిట కృత్రిమ కొరత సృష్టించి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించి భారీ కుంభకోణానికి తెరలేపారు. బినామీ సంస్థల ద్వారా అధిక ధరలకు మందులు, ల్యాబ్ కిట్లు కొనుగోలు చేసి ఖజానాకు ఏకంగా రూ. 211 కోట్ల నష్టం చేకూర్చారు. ఈ కేసులో నాటి ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ సహా పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కోణం ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో పాటు రూ. 144 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో పద్మకు సంబంధించిన రూ. 74 లక్షల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి.

ఒక్క లేఖతో కేసు అటకెక్కించే యత్నం!

మెడికల్ క్యాంపుల పేరిట నిధులు, మందులను పక్కదారి పట్టించారని, రికార్డులను తారుమారు చేశారని పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ.. కార్మిక శాఖ అధికారులు మాత్రం ఆమెపై కేవలం "శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుంది" అంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించారు. ఆ లేఖ ఆధారంగా ఏసీబీ అధికారులు గత ఏడాది ఆమెపై అభియోగాలను డ్రాప్ చేశారు.

తెరవెనుక లాబీయింగ్‌పై ఇంటెలిజెన్స్ నజర్

ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇంతటి భారీ స్కామ్‌లో కోర్టుల్లో చార్జ్‌షీట్లు దాఖలైన తర్వాత కూడా నిందితురాలికి కొమ్ముకాసిందెవరు? ఆమెను రక్షించేందుకు కార్మిక శాఖలో ఎవరెవరు లాబీయింగ్ చేశారు? అనే అంశంపై సీఎం సీరియస్ కావడంతో ప్రస్తుతం రాష్ట్ర నిఘా వర్గాలు లోతైన ఆరా తీస్తున్నాయి. కేసును నీరుగార్చేందుకు చక్రం తిప్పిన ఉన్నతాధికారులు, పెద్ద తలకాయల గుట్టు త్వరలోనే రట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

https://youtu.be/VpPQST7z0qU?si=thJj1Tj5TUW9jSnr

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 11-10-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

రూ.211 కోట్ల మెడికల్ స్కాం.. బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి.. రంగంలోకి ఇంటలిజెన్స్ వర్గాలు.!

news image
హైదరాబాద్, Oct 11 (ప్రజాయుద్ధనౌక న్యూస్): (తెలంగాణ): ★ ఏసీబీ కష్టపడి పట్టుకుంటే.. లోపాయికారీగా ఎలా వదిలేస్తారు?★ నిందితులకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సీఎం తీవ్ర ఆగ్రహం!హైదరాబాద్ (ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ కుంభకోణం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల గండికొట్టిన ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నాటి జాయింట్ డైరెక్టర్ (జేడీ) పద్మను ఏసీబీ కేసు నుంచి తప్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు రేయింబవళ్లు కష్టపడి ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేస్తే.. ఇలా లోపాయికారీగా నిందితులను ఎలా వదిలేస్తారు? దీనివల్ల సమాజంలోకి, ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుంది? ప్రాసిక్యూషన్ అనుమతులను ఏళ్ల తరబడి ఎందుకు తొక్కిపెడుతున్నారు? అంటూ కార్మిక శాఖ ఉన్నతాధికారుల తీరుపై సీఎం మండిపడ్డారు. ఇప్పటివరకు నమోదైన ఏసీబీ కేసుల్లో ‘యాక్షన్ డ్రాప్’ చేసిన ప్రతి కేసు వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.                        ఖజానాకు రూ. 211 కోట్ల గండి.. ఈడీ ఆస్తుల జప్తు2019లో ఈఎస్ఐ ఆసుపత్రులకు అత్యవసర మందుల సరఫరా పేరిట కృత్రిమ కొరత సృష్టించి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించి భారీ కుంభకోణానికి తెరలేపారు. బినామీ సంస్థల ద్వారా అధిక ధరలకు మందులు, ల్యాబ్ కిట్లు కొనుగోలు చేసి ఖజానాకు ఏకంగా రూ. 211 కోట్ల నష్టం చేకూర్చారు. ఈ కేసులో నాటి ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ సహా పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కోణం ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో పాటు రూ. 144 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో పద్మకు సంబంధించిన రూ. 74 లక్షల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి.ఒక్క లేఖతో కేసు అటకెక్కించే యత్నం!మెడికల్ క్యాంపుల పేరిట నిధులు, మందులను పక్కదారి పట్టించారని, రికార్డులను తారుమారు చేశారని పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ.. కార్మిక శాఖ అధికారులు మాత్రం ఆమెపై కేవలం "శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుంది" అంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించారు. ఆ లేఖ ఆధారంగా ఏసీబీ అధికారులు గత ఏడాది ఆమెపై అభియోగాలను డ్రాప్ చేశారు.తెరవెనుక లాబీయింగ్‌పై ఇంటెలిజెన్స్ నజర్ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇంతటి భారీ స్కామ్‌లో కోర్టుల్లో చార్జ్‌షీట్లు దాఖలైన తర్వాత కూడా నిందితురాలికి కొమ్ముకాసిందెవరు? ఆమెను రక్షించేందుకు కార్మిక శాఖలో ఎవరెవరు లాబీయింగ్ చేశారు? అనే అంశంపై సీఎం సీరియస్ కావడంతో ప్రస్తుతం రాష్ట్ర నిఘా వర్గాలు లోతైన ఆరా తీస్తున్నాయి. కేసును నీరుగార్చేందుకు చక్రం తిప్పిన ఉన్నతాధికారులు, పెద్ద తలకాయల గుట్టు త్వరలోనే రట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.https://youtu.be/VpPQST7z0qU?si=thJj1Tj5TUW9jSnr