Copyrights Reserved © 2026
prajayuddanouka.com
»» స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శనివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ చేనేత, సంస్కృతిని ప్రతిబింబించేలా ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించిన ఆయన, దానికి జతగా తెల్లటి కుర్తా-పైజామా మరియు చాక్లెట్ గోధుమ రంగు కోట్తో వేడుకలకు హాజరయ్యారు. ప్రత్యేకంగా తన కోటు జేబులో జాతీయ పతాక రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను అమర్చుకుని దేశభక్తి భావాన్ని చాటుతూ ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): దేశంలోని నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తుల (Chief Justices) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సులు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 6న ప్రత్యేకంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ వి. కామేశ్వర్ రావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేశారు. బాంబే హైకోర్టులో జడ్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ రవీంద్ర వి. ఘుగేను కలకత్తా హైకోర్టు సీజేగా ప్రతిపాదించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించారు. ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అశ్వనీకుమార్ మిశ్రాను అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని కొలీజియం నిర్ణయించింది. కొలీజియం చేసిన ఈ నాలుగు సిఫార్సుల ఫైలును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. కేంద్రం దీనిపై పరిశీలన పూర్తి చేసి ఆమోదం తెలిపిన అనంతరం, భారత రాష్ట్రపతి ఉత్తర్వులతో అధికారిక నియామక నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల రాజ్భవన్లలో గవర్నర్ల సమక్షంలో నూతన సీజేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నియామకాల ద్వారా ఆయా ఉన్నత న్యాయస్థానాల్లో పాలనా యంత్రాంగం మరింత బలోపేతం కావడమే కాకుండా, బకాయి ఉన్న కేసుల విచారణ కూడా వేగవంతం కానుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి (న్యూఢిల్లీ): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందం పార్లమెంట్ హౌస్ యానెక్స్‌లో బుధవారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిలిచిపోయిన పలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదిత రహదారుల నిర్మాణానికి అవసరమైన అటవీ మరియు పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్, ఎస్ఆర్ విఆర్ డిండి, గౌరవెల్లి వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తేనే రాష్ట్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయని వివరిస్తూ ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వీటితో పాటు, పర్యావరణ సంరక్షణను దెబ్బతీయకుండా ప్రజల సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడే ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు.
»»» భారీ ఖర్చులు అవసరం లేదు.. తాత్కాలిక గుర్తులైనా చాలు: ధర్మాసనం»»» ఐదేళ్ల బాలుడి ప్రమాదం కేసులో కీలక తీర్పు»»» ఫుట్‌పాత్‌పై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు»»» ప్రత్యేక నియంత్రణ సంస్థ అవసరంప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి (న్యూఢిల్లీ): దేశంలో రహదారి వినియోగదారుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు సురక్షితంగా నడిచేందుకు వీలుగా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పాదచారుల కోసం కేటాయించిన ఈ మార్గాలు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, వాహనాల రాకపోకల మార్గం నుంచి వాటిని స్పష్టంగా వేరు చేసి గుర్తించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు పలు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడ రహదారి ఉంటే అక్కడ పాదచారుల కోసం ప్రత్యేక స్థలం కూడా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, తాడు లేదా ఇతర తాత్కాలిక గుర్తులతోనైనా పాదచారుల మార్గాన్ని స్పష్టంగా గుర్తించాలని పేర్కొంది. ఆ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూస్తూ, వాహనాల భయం లేకుండా పాదచారులు తమ మార్గంలో స్వేచ్ఛగా, సురక్షితంగా నడిచే పరిస్థితిని కల్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు, ఇందుకు రెండు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.ఒక రోడ్డు ప్రమాద పరిహారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం క్రితం తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని వెనుక నుంచి వచ్చిన ఒక లారీ ఢీకొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి రూ. 25 లక్షల పరిహారం కోరుతూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, ట్రైబ్యునల్ రూ. 7.82 లక్షలు మంజూరు చేసింది. అయితే హైకోర్టులో అప్పీల్ చేయగా పరిహారాన్ని రూ. 4.70 లక్షలకు తగ్గించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తండ్రికి ఊరటనిస్తూ, హైకోర్టు తీర్పును రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం రూ. 11.44 లక్షల పరిహారాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తించిన ఫుట్‌పాత్‌పై నడవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం స్వేచ్ఛగా సంచరించే హక్కుతో పాటు, ఆర్టికల్ 19(1)(ఏ), 19(1)(బి), 19(1)(సి) మరియు ఆర్టికల్ 21లోని జీవించే హక్కుతో కూడా ఈ హక్కు ముడిపడి ఉందని పేర్కొంది. రోడ్లపై మోటారు వాహనాల కంటే పాదచారుల హక్కులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు పాదచారుల మార్గాలను నిర్మించడం, నిర్వహించడం మరియు ఆక్రమణల నుంచి కాపాడటం తమ విధిగా నిర్వర్తించాలని స్పష్టం చేసింది. అలాగే పాదచారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, పాదచారుల హక్కుల ఉల్లంఘన జరిగితే అధికారులపై చట్టపరమైన చర్యలు కోరే హక్కు పౌరులకు ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రజాయద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి (న్యూఢిల్లీ): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష 'INDIA' కూటమి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేశంలో సంచలనం సృష్టిస్తున్న రెండు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సభకు వచ్చి స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కూటమి నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రధాన డిమాండ్లను ఉంచాయి.1. విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్ల ప్రయోగంపై హోంశాఖ వివరణ ఇవ్వాలిశాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన తీవ్రమైన లాఠీచార్జ్ మరియు పెల్లెట్ గన్ ప్రయోగాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్‌కు వచ్చి, అసలు విద్యార్థులపై అంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2. శ్రీరామ మందిర విరాళాల దుర్వినియోగంపై ప్రధాని సమాధానం చెప్పాలిశ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యకలాపాలు ప్రధానమంత్రి పర్యవేక్షణ పరిధిలో ఉన్నప్పటికీ, భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన ‘చందా’ (విరాళాలు) చోరీకి గురికావడం లేదా దుర్వినియోగం కావడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విరాళాల నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని, మోదీ ప్రభుత్వం ప్రజలకు, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాల్సిందేనని 'INDIA' కూటమి నేతలు స్పష్టం చేశారు.
స్నేహం అనేది మాటల్లో కాదు, మనసులో పుడుతుంది. కాలమే దాన్ని పరీక్షిస్తుంది కష్టకాలంలో నిలబడేది నిజమైన స్నేహమే.. ప్రజాయుద్ధనౌక వీక్షకులకు, పాఠకులకు మరియు ప్రకటన కర్తలకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు - చైర్మన్ రొడ్డ నాగరాజు(RNR).
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నిరోధించేందుకు మరింత కఠినమైన చట్టాన్ని తీసుకొస్తోంది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026ను సోమవారం జూలై 27న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ ఆదివారం కావడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు లేవు. వీకెండ్ విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ సభలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి వీడియో సందేశంలో “వచ్చే వారం పార్లమెంట్లో కఠిన చట్టం తీసుకొస్తాం” అని ప్రకటించిన తర్వాత.. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లును ఆమోదించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బిల్లు ద్వారా.. 2024లో అమల్లోకి వచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని సవరిస్తున్నారు. నీట్ యుజి 2026 పేపర్ లీక్ వివాదం, జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనల మధ్య ఈ చర్య తీసుకున్నారు. ఈ సవరణ బిల్లును చట్టంగా మార్చి.. పరీక్షల వ్యవస్థలపై తిరిగి ప్రజల్లో, యువతలో నమ్మకం కలిగించాలి అని కేంద్రం ప్రయత్నిస్తోంది.బిల్లులోని ముఖ్యమైన నిబంధనలు ఇవి:సాధారణ నేరాలకు కనీస జైలు శిక్షను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచారు. మాగ్జిమం శిక్షను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.సంఘటిత నేరాలకు అంటే.. ఆర్గనైజ్డ్ క్రైమ్‌కి.. అంటే కావాలని, ఓ పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసే విద్యా నేరాలకు.. కనీస జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు పెంచారు. జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచారు. సర్వీస్ ప్రొవైడర్లకు.. అంటే.. పరీక్షా కేంద్రాలు, ఏజెన్సీలకు జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. వారిని 4 సంవత్సరాలకు బదులు 8 సంవత్సరాల పాటు పబ్లిక్ ఎగ్జామ్స్ నుంచి బహిష్కరించేలా బిల్లు ఉంది. అవసరమైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దర్యాప్తు రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరపాలి. ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత 3 నెలల్లోపు ట్రయల్ పూర్తి చేయాలి. అప్పీళ్లు సాధ్యమైనంత వరకు 3 నెలల్లోపు పరిష్కరించాలి.ఈ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ, ఆమోదం కోసం ప్రయత్నిస్తారు. ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును వీలైనంత త్వరగా పాస్ చేయాలని సూచించారు. విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి.. ఈ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఆమోదించే ఛాన్స్ ఉంది. మొత్తంగా, ఈ అమెండ్మెంట్ బిల్లు పరీక్షా మోసాలపై కఠిన చర్యలు, వేగవంతమైన న్యాయం, బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించే దిశగా ముఖ్యమైన అడుగు. విద్యార్థుల భవిష్యత్తుకు హామీ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.పరీక్షా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులుకేవలం శిక్షలు పెంచడమే కాకుండా, విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా బాధితులకు తక్షణ న్యాయం చేకూర్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం."లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును కొందరు అక్రమార్కులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదు. ప్రతి నిమిషం పారదర్శకతకే ప్రాధాన్యమిస్తాం." — కేంద్ర ప్రభుత్వ వర్గాలుప్రతిపక్షాల వ్యూహంపై సర్వత్రా ఆసక్తిమరోవైపు సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న ఈ సవరణ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయమైనందున ప్రతిపక్షాలు కూడా బిల్లుకు సూత్రప్రాయంగా మద్దతు తెలిపే అవకాశాలున్నప్పటికీ, గత లీకేజీల బాధ్యతపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఏది ఏమైనా, వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు చట్టంగా మారితే దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు రాసే కోట్లాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోషికి అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, ఇప్పటికే జోషి ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా సేవలందిస్తున్నారు. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు జోషినే అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు..