Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
రాజకీయాలు బ్రేకింగ్

సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం: మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

ప్రతినిధి: మేడ్చల్ - మల్కాజ్‌గిరి
ప్రచురణ: 17 Aug 2026 05:59 PM
వీక్షణలు: 25 Views
సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం: మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మేడ్చల్ మల్కాజ్గిరి/ మేడిపల్లి): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మేడిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. మాజీ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జక్క వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, పేదలకు అందుతున్న పథకాలను కూడా కొనసాగించలేక చేతులెత్తేయడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు, కేసుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు, పేద మహిళలకు సంబంధించిన ఈ పథకాల రక్షణ కోసం హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించే న్యాయవాదులను నియమించకపోవడం వారి నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, పేదల సంక్షేమానికి గండికొట్టేలా వ్యవహరించడం సమంజసం కాదని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నైపుణ్యం కలిగిన న్యాయవాదులను ఏర్పాటు చేసి కోర్టులో సరైన వాదనలు వినిపించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను నిరంతరాయంగా కొనసాగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రఘువర్దన్‌రెడ్డి, లేతకుల రఘుపతిరెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, కొత్త రవిగౌడ్‌, మీసాల కృష్ణ, కొత్త చక్రపాణిగౌడ్‌,  రాజిరెడ్డి, పైల్ల ప్రభాకర్‌రెడ్డి, మహేష్‌ నిర్మల, కౌడె పోచయ్య తో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం: మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

news image
హైదరాబాద్, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మేడ్చల్ మల్కాజ్గిరి/ మేడిపల్లి): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మేడిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. మాజీ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జక్క వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, పేదలకు అందుతున్న పథకాలను కూడా కొనసాగించలేక చేతులెత్తేయడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు, కేసుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు, పేద మహిళలకు సంబంధించిన ఈ పథకాల రక్షణ కోసం హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించే న్యాయవాదులను నియమించకపోవడం వారి నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, పేదల సంక్షేమానికి గండికొట్టేలా వ్యవహరించడం సమంజసం కాదని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నైపుణ్యం కలిగిన న్యాయవాదులను ఏర్పాటు చేసి కోర్టులో సరైన వాదనలు వినిపించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను నిరంతరాయంగా కొనసాగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రఘువర్దన్‌రెడ్డి, లేతకుల రఘుపతిరెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, కొత్త రవిగౌడ్‌, మీసాల కృష్ణ, కొత్త చక్రపాణిగౌడ్‌,  రాజిరెడ్డి, పైల్ల ప్రభాకర్‌రెడ్డి, మహేష్‌ నిర్మల, కౌడె పోచయ్య తో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.