Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

‘ది హైదరాబాద్ లా కాలేజీ’లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 16 Aug 2026 02:42 AM
వీక్షణలు: 86 Views
‘ది హైదరాబాద్ లా కాలేజీ’లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్/ఉప్పల్): ఉప్పల్ భగాయత్‌లోని ప్రముఖ విద్యాసంస్థ ‘ది హైదరాబాద్ లా కాలేజీ’ ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కె. భూపతి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో న్యాయ విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు విద్యార్థులు చిప్పలపల్లి యాదగిరి, చంద్రస్వామి, సంతోష్ రెడ్డి, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

‘ది హైదరాబాద్ లా కాలేజీ’లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

news image
హైదరాబాద్ , Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్/ఉప్పల్): ఉప్పల్ భగాయత్‌లోని ప్రముఖ విద్యాసంస్థ ‘ది హైదరాబాద్ లా కాలేజీ’ ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కె. భూపతి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో న్యాయ విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు విద్యార్థులు చిప్పలపల్లి యాదగిరి, చంద్రస్వామి, సంతోష్ రెడ్డి, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.