Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి(ఆంధ్రప్రదేశ్): కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన సైనికులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా (X) వేదికగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అత్యంత ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని భారత సైనికులు చూపిన అతులిత ధైర్యసాహసాలు, పోరాట పటిమను వారు కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయక సైనికులు చేసిన త్యాగాలు అమరమైనవని, ప్రతి భారతీయుడికీ వారి పోరాటం నిరంతరం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం పోరాడి అమరులైన వీరజవాన్ల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీ, పోలీసు ఉన్నతాధికారులు వేగంగా రంగంలోకి దిగారు. ఈ అక్రమ రవాణాలో భాగస్వాములైన ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి బెంగళూరు, కోల్కతా, హర్యానా ప్రాంతాలకు ప్రత్యేక పోలీస్, టాస్క్ఫోర్స్ బృందాలను పంపినట్లు సమాచారం. స్మగ్లింగ్ నెట్వర్క్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ఎలా భాగమయ్యాడు? అతడికి గతంలో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ ముమ్మరం చేశారు. డిపార్ట్మెంట్లో ఉంటూ స్మగ్లర్లకు సహకరించే నల్లగొర్రెలను ఏరిపారేసేందుకు అటవీ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. 'ఆపరేషన్ అరణ్య'లో భాగంగా నిఘా వర్గాలను మరింత అప్రమత్తం చేశామని, ప్రభుత్వ సంపదను కాపాడే విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.