Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్

పవన్ కల్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖలో కంగారు.. మిగతా నిందితుల కోసం గాలింపు వేగవంతం

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 26 Jul 2026 12:38 AM
వీక్షణలు: 23 Views
పవన్ కల్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖలో కంగారు.. మిగతా నిందితుల కోసం గాలింపు వేగవంతం


ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధిఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీ, పోలీసు ఉన్నతాధికారులు వేగంగా రంగంలోకి దిగారు. ఈ అక్రమ రవాణాలో భాగస్వాములైన ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి బెంగళూరు, కోల్‌కతా, హర్యానా ప్రాంతాలకు ప్రత్యేక పోలీస్, టాస్క్‌ఫోర్స్ బృందాలను పంపినట్లు సమాచారం. ​స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ఎలా భాగమయ్యాడు? అతడికి గతంలో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ ముమ్మరం చేశారు. డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ స్మగ్లర్లకు సహకరించే నల్లగొర్రెలను ఏరిపారేసేందుకు అటవీ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. 'ఆపరేషన్ అరణ్య'లో భాగంగా నిఘా వర్గాలను మరింత అప్రమత్తం చేశామని, ప్రభుత్వ సంపదను కాపాడే విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

పవన్ కల్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖలో కంగారు.. మిగతా నిందితుల కోసం గాలింపు వేగవంతం

news image
హైదరాబాద్, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీ, పోలీసు ఉన్నతాధికారులు వేగంగా రంగంలోకి దిగారు. ఈ అక్రమ రవాణాలో భాగస్వాములైన ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి బెంగళూరు, కోల్‌కతా, హర్యానా ప్రాంతాలకు ప్రత్యేక పోలీస్, టాస్క్‌ఫోర్స్ బృందాలను పంపినట్లు సమాచారం. ​స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ఎలా భాగమయ్యాడు? అతడికి గతంలో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ ముమ్మరం చేశారు. డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ స్మగ్లర్లకు సహకరించే నల్లగొర్రెలను ఏరిపారేసేందుకు అటవీ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. 'ఆపరేషన్ అరణ్య'లో భాగంగా నిఘా వర్గాలను మరింత అప్రమత్తం చేశామని, ప్రభుత్వ సంపదను కాపాడే విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.