Copyrights Reserved © 2026
prajayuddanouka.com
న్యూజెర్సీ (మెట్‌లైఫ్ స్టేడియం): అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రపంచంలో యూరోపియన్ దిగ్గజం స్పెయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ రెండోసారి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. 2010 తర్వాత స్పెయిన్ జట్టు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఎక్స్ట్రా టైమ్‌లో మెరిసిన ఫెర్రాన్ టొర్రెస్ నిర్దేశిత 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తూ, 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టొర్రెస్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. పెడ్రో పోరో అందించిన పాస్‌ను నికో విలియమ్స్ చక్కగా కనెక్ట్ చేయగా, టొర్రెస్ దానిని అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్ పోస్ట్‌లోకి పంపాడు. 10 మందితోనే పోరాడిన అర్జెంటీనా.. నిరాశపరిచిన మెస్సీ ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాను స్పెయిన్ డిఫెన్స్ పూర్తిగా కట్టడి చేసింది. లైనల్ మెస్సీ మ్యాజిక్ ఈ మ్యాచ్‌లో పెద్దగా పనిచేయలేదు. మ్యాచ్ 90 నిమిషాల ముగింపు సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ రెండో పసుపు కార్డు (రెడ్ కార్డ్) పొంది మైదానాన్ని వీడటంతో అర్జెంటీనా చివరి నిమిషాల్లో 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. అర్జెంటీనా పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, స్పెయిన్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. రికార్డుల స్పెయిన్ అజేయ రికార్డు: ఈ టోర్నమెంట్లో ఆడిన 8 మ్యాచ్‌లలో స్పెయిన్ కేవలం ఒకే ఒక్క గోల్ సమర్పించుకుని అత్యుత్తమ డిఫెన్సివ్ రికార్డుతో ట్రోఫీని ముద్దాడింది. వయసు రికార్డు: స్పెయిన్ కోచ్ లూయిస్ డి లా ఫ్యూంటె (65 ఏళ్లు) వరల్డ్ కప్ సాధించిన అత్యంత వృద్ధ కోచ్‌గా రికార్డు సృష్టించారు. అలాగే ఆ జట్టులోని 19 ఏళ్ల యువ సంచలనాలు లామైన్ యమల్, పావ్ కుబార్సీలు ఫైనల్ ఆడిన అతి పిన్న వయస్కులుగా నిలిచారు. ఈ విజయంతో స్పెయిన్ జట్టు అటు యూరో కప్ (2024), ఇటు వరల్డ్ కప్ (2026) రెండు ప్రధాన టైటిళ్లను ఒకేసారి తమ ఖాతాలో వేసుకుని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
(తెలంగాణ): టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 300 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ ద్వారా 29 ఏళ్ల స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 12వ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ రికార్డ్ గురించి మాట్లాడుతూ.. స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. గత రాత్రే తనకు ఈ రికార్డ్ గురించి తెలిసిందని వెల్లడించింది. లార్డ్స్ వేదికగా 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన విషయాన్ని, ఆ కఠిన టోర్నీ తర్వాత తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని గుర్తు చేసుకుంది. 'గత రాత్రే నేను 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాననే విషయం తెలిసింది. ఓ ప్లేయర్‌గా ప్రతీ ఫార్మాట్లో ఎన్ని మ్యాచ్‌లు ఆడామనే విషయాన్ని లెక్కించుకోలేం. లార్డ్స్ వేదికగా ఆడిన 2017 ప్రపంచకప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. ఆ ప్రపంచకప్‌లో నేను సరిగ్గా ఆడలేదు. నాకు మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం లభిస్తుందా? అని అప్పుడు అనిపించింది. అలాంటి పరిస్థితుల నుంచి పుంజుకొని ఇప్పుడు లార్డ్స్ మైదానంలో 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. లార్డ్స్ వేదికగానే టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే అవకాశం మాకులభించింది. కానీ ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. కానీ ఇది క్రికెట్. ముందుకు సాగాల్సిందే. సెంచరీ చేసినా.. డకౌట్ అయినా.. మైదానంలో వెళ్లిన ప్రతీసారి సున్నా నుంచే మొదలు పెట్టాలి. టీమ్ విషయంలో కూడా అంతే. మంచి, చెడు రోజులు ఉంటాయి. కానీ మేం దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏకైక టెస్ట్ కోసం మా జట్టు అన్ని విధాల సిద్దమైంది.'అని స్మృతి మంధాన తెలిపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ తరఫున తెలుగు తేజం శ్రీచరణి అరంగేట్రం చేసింది. యస్తికా భాటియా తిరిగి జట్టులో చేరింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. జెమీమాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం టీమిండియా మహిళలు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కెరీర్లో 368వది. దీంతో 367 మ్యాచ్‌లతో ఉన్న న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ(357), టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(333), న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్(313) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ప్రపంచ రికార్డుకు చేరువలో.. హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ప్రపంచ రికార్డుకు అత్యంత చేరువలో ఉంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన హర్మన్.. ఇప్పటి వరకు 197 టీ20లు, 164 వన్డేలు, 7 టెస్టులు ఆడింది. మరో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడితే.. 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా(పురుషులు, మహిళలు కలిపి) ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ఈ జాబితాలో ప్రస్తుతం 197 టీ20లతో హర్మన్‌ప్రీత్ అగ్రస్థానంలో ఉండగా.. బేట్స్ 183 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్ డెన్నీ వ్యాట్ 180 మ్యాచ్‌లతో మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్లో ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. అతడు 163 టీ20లు ఆడాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 40 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు అలిస్ క్యాప్సీ(82), హీథర్ నైట్(70*) చెలరేగిపోయారు. నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు.