Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

ప్రతినిధి: ప్రతినిధి
ప్రచురణ: 03 Jun 2026 03:59 AM
చరిత్ర సృష్టించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం టీమిండియా మహిళలు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కెరీర్‌లో 368వది. దీంతో 367 మ్యాచ్‌లతో ఉన్న న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ(357), టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(333), న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్(313) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ప్రపంచ రికార్డుకు చేరువలో.. హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ప్రపంచ రికార్డుకు అత్యంత చేరువలో ఉంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హర్మన్.. ఇప్పటి వరకు 197 టీ20లు, 164 వన్డేలు, 7 టెస్టులు ఆడింది. మరో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడితే.. 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా(పురుషులు, మహిళలు కలిపి) ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ఈ జాబితాలో ప్రస్తుతం 197 టీ20లతో హర్మన్‌ప్రీత్ అగ్రస్థానంలో ఉండగా.. బేట్స్ 183 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్ డెన్నీ వ్యాట్ 180 మ్యాచ్‌లతో మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. అతడు 163 టీ20లు ఆడాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 40 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు అలిస్ క్యాప్సీ(82), హీథర్ నైట్(70*) చెలరేగిపోయారు. నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 22-07-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

చరిత్ర సృష్టించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

news image
హైదరాబాద్, Jul 22 (ప్రజాయుద్ధనౌక న్యూస్): భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం టీమిండియా మహిళలు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కెరీర్‌లో 368వది. దీంతో 367 మ్యాచ్‌లతో ఉన్న న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ(357), టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(333), న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్(313) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ప్రపంచ రికార్డుకు చేరువలో.. హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ప్రపంచ రికార్డుకు అత్యంత చేరువలో ఉంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హర్మన్.. ఇప్పటి వరకు 197 టీ20లు, 164 వన్డేలు, 7 టెస్టులు ఆడింది. మరో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడితే.. 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా(పురుషులు, మహిళలు కలిపి) ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ఈ జాబితాలో ప్రస్తుతం 197 టీ20లతో హర్మన్‌ప్రీత్ అగ్రస్థానంలో ఉండగా.. బేట్స్ 183 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్ డెన్నీ వ్యాట్ 180 మ్యాచ్‌లతో మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. అతడు 163 టీ20లు ఆడాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 40 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు అలిస్ క్యాప్సీ(82), హీథర్ నైట్(70*) చెలరేగిపోయారు. నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు.