Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
క్రీడలు బ్రేకింగ్

స్మృతి మంధాన ‘ట్రిపుల్ సెంచరీ’!

ప్రతినిధి: Chief Editor
ప్రచురణ: 10 Jul 2026 07:58 PM
స్మృతి మంధాన ‘ట్రిపుల్ సెంచరీ’!
(తెలంగాణ): టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 300 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌ ద్వారా 29 ఏళ్ల స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 12వ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ రికార్డ్ గురించి మాట్లాడుతూ.. స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. గత రాత్రే తనకు ఈ రికార్డ్ గురించి తెలిసిందని వెల్లడించింది. లార్డ్స్ వేదికగా 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన విషయాన్ని, ఆ కఠిన టోర్నీ తర్వాత తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని గుర్తు చేసుకుంది. 'గత రాత్రే నేను 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాననే విషయం తెలిసింది. ఓ ప్లేయర్‌గా ప్రతీ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడామనే విషయాన్ని లెక్కించుకోలేం. లార్డ్స్ వేదికగా ఆడిన 2017 ప్రపంచకప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. ఆ ప్రపంచకప్‌లో నేను సరిగ్గా ఆడలేదు. నాకు మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం లభిస్తుందా? అని అప్పుడు అనిపించింది. అలాంటి పరిస్థితుల నుంచి పుంజుకొని ఇప్పుడు లార్డ్స్ మైదానంలో 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. లార్డ్స్ వేదికగానే టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే అవకాశం మాకులభించింది. కానీ ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. కానీ ఇది క్రికెట్. ముందుకు సాగాల్సిందే. సెంచరీ చేసినా.. డకౌట్ అయినా.. మైదానంలో వెళ్లిన ప్రతీసారి సున్నా నుంచే మొదలు పెట్టాలి. టీమ్ విషయంలో కూడా అంతే. మంచి, చెడు రోజులు ఉంటాయి. కానీ మేం దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏకైక టెస్ట్ కోసం మా జట్టు అన్ని విధాల సిద్దమైంది.'అని స్మృతి మంధాన తెలిపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ తరఫున తెలుగు తేజం శ్రీచరణి అరంగేట్రం చేసింది. యస్తికా భాటియా తిరిగి జట్టులో చేరింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. జెమీమాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తుంది.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 22-07-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

స్మృతి మంధాన ‘ట్రిపుల్ సెంచరీ’!

news image
హైదరాబాద్, Jul 22 (ప్రజాయుద్ధనౌక న్యూస్): (తెలంగాణ): టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 300 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌ ద్వారా 29 ఏళ్ల స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 12వ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ రికార్డ్ గురించి మాట్లాడుతూ.. స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. గత రాత్రే తనకు ఈ రికార్డ్ గురించి తెలిసిందని వెల్లడించింది. లార్డ్స్ వేదికగా 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన విషయాన్ని, ఆ కఠిన టోర్నీ తర్వాత తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని గుర్తు చేసుకుంది. 'గత రాత్రే నేను 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాననే విషయం తెలిసింది. ఓ ప్లేయర్‌గా ప్రతీ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడామనే విషయాన్ని లెక్కించుకోలేం. లార్డ్స్ వేదికగా ఆడిన 2017 ప్రపంచకప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. ఆ ప్రపంచకప్‌లో నేను సరిగ్గా ఆడలేదు. నాకు మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం లభిస్తుందా? అని అప్పుడు అనిపించింది. అలాంటి పరిస్థితుల నుంచి పుంజుకొని ఇప్పుడు లార్డ్స్ మైదానంలో 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. లార్డ్స్ వేదికగానే టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే అవకాశం మాకులభించింది. కానీ ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. కానీ ఇది క్రికెట్. ముందుకు సాగాల్సిందే. సెంచరీ చేసినా.. డకౌట్ అయినా.. మైదానంలో వెళ్లిన ప్రతీసారి సున్నా నుంచే మొదలు పెట్టాలి. టీమ్ విషయంలో కూడా అంతే. మంచి, చెడు రోజులు ఉంటాయి. కానీ మేం దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏకైక టెస్ట్ కోసం మా జట్టు అన్ని విధాల సిద్దమైంది.'అని స్మృతి మంధాన తెలిపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ తరఫున తెలుగు తేజం శ్రీచరణి అరంగేట్రం చేసింది. యస్తికా భాటియా తిరిగి జట్టులో చేరింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. జెమీమాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తుంది.