కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి(ఆంధ్రప్రదేశ్): కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన సైనికులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా (X) వేదికగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అత్యంత ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని భారత సైనికులు చూపిన అతులిత ధైర్యసాహసాలు, పోరాట పటిమను వారు కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయక సైనికులు చేసిన త్యాగాలు అమరమైనవని, ప్రతి భారతీయుడికీ వారి పోరాటం నిరంతరం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం పోరాడి అమరులైన వీరజవాన్ల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు.