జాతీయం
బ్రేకింగ్
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
»» స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శనివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ చేనేత, సంస్కృతిని ప్రతిబింబించేలా ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించిన ఆయన, దానికి జతగా తెల్లటి కుర్తా-పైజామా మరియు చాక్లెట్ గోధుమ రంగు కోట్‌తో వేడుకలకు హాజరయ్యారు. ప్రత్యేకంగా తన కోటు జేబులో జాతీయ పతాక రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను అమర్చుకుని దేశభక్తి భావాన్ని చాటుతూ ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు.