Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
క్రీడలు బ్రేకింగ్

క్రీడల్లో ఆడబిడ్డల సత్తాకు నిదర్శనం హారిక.. రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి రొడ్డ హారికకు ఘన సన్మానం

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 13 Oct 2026 11:59 AM
వీక్షణలు: 454 Views
క్రీడల్లో ఆడబిడ్డల సత్తాకు నిదర్శనం హారిక.. రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి రొడ్డ హారికకు ఘన సన్మానం

★ హారిక విజయానికి తండ్రి ప్రోత్సాహమే కారణమన్న అనిల్ కుమార్ మాదిగ

★ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఆశీర్వాదం

★ప్రోత్సహిస్తే ఆడపిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని ప్రశంసించిన అతిథులు

★ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం, తల్లిదండ్రుల అండ తప్పనిసరన్న అతిథులు

★ ఎల్బీనగర్‌, మన్సురాబాద్ లోని నివాసంలో శాలువాలతో సత్కరించిన ఎమ్మార్పీఎస్ నేతలు, ఉద్యమ గాయకులు

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్: ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని చెప్పడానికి యువ క్రీడాకారిణి రొడ్డ హారిక సాధించిన విజయమే నిదర్శనమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్ సాధించిన రొడ్డ హారికను మంగళవారం ఘనంగా సన్మానించారు.

  సీనియర్ జర్నలిస్ట్, 'ప్రజాయుద్ధనౌక' మీడియా సంస్థల చైర్మన్ రొడ్డ నాగరాజు, సంధ్య దంపతుల కుమార్తె హారిక. ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం సీనియర్ ఉపాధ్యక్షులు మొగిలిపాక మీనయ్య, తెలంగాణ ఉద్యమ గాయకులు ఏపూరి యాకన్న తదితరులు ఎల్బీనగర్, మన్సురాబాద్ లోని వారి నివాసానికి విచ్చేసి హారికను శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతను ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ.. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న తండ్రి నాగరాజు పట్టుదలకు అనుగుణంగా, హారిక రాష్ట్రస్థాయిలో పతకం సాధించడం ఎంతో హర్షనీయం. తల్లిదండ్రుల అండదండలు, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకుని పేద, మధ్యతరగతి బిడ్డలు క్రీడల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి అని సూచించారు. నిరంతర సాధనతో హారిక భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొని అఖండ విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. తద్వారా కన్నవారికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సొంత ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 19-11-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

క్రీడల్లో ఆడబిడ్డల సత్తాకు నిదర్శనం హారిక.. రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి రొడ్డ హారికకు ఘన సన్మానం

news image
హైదరాబాద్, Nov 19 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ★ హారిక విజయానికి తండ్రి ప్రోత్సాహమే కారణమన్న అనిల్ కుమార్ మాదిగ★ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఆశీర్వాదం★ప్రోత్సహిస్తే ఆడపిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని ప్రశంసించిన అతిథులు★ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం, తల్లిదండ్రుల అండ తప్పనిసరన్న అతిథులు★ ఎల్బీనగర్‌, మన్సురాబాద్ లోని నివాసంలో శాలువాలతో సత్కరించిన ఎమ్మార్పీఎస్ నేతలు, ఉద్యమ గాయకులుప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్: ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని చెప్పడానికి యువ క్రీడాకారిణి రొడ్డ హారిక సాధించిన విజయమే నిదర్శనమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్ సాధించిన రొడ్డ హారికను మంగళవారం ఘనంగా సన్మానించారు.  సీనియర్ జర్నలిస్ట్, 'ప్రజాయుద్ధనౌక' మీడియా సంస్థల చైర్మన్ రొడ్డ నాగరాజు, సంధ్య దంపతుల కుమార్తె హారిక. ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం సీనియర్ ఉపాధ్యక్షులు మొగిలిపాక మీనయ్య, తెలంగాణ ఉద్యమ గాయకులు ఏపూరి యాకన్న తదితరులు ఎల్బీనగర్, మన్సురాబాద్ లోని వారి నివాసానికి విచ్చేసి హారికను శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతను ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ.. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న తండ్రి నాగరాజు పట్టుదలకు అనుగుణంగా, హారిక రాష్ట్రస్థాయిలో పతకం సాధించడం ఎంతో హర్షనీయం. తల్లిదండ్రుల అండదండలు, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకుని పేద, మధ్యతరగతి బిడ్డలు క్రీడల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి అని సూచించారు. నిరంతర సాధనతో హారిక భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొని అఖండ విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. తద్వారా కన్నవారికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సొంత ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.