Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

పచ్చని వెల్దేవి పల్లెలో చిచ్చు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు: కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య నాగరాజు హెచ్చరిక

ప్రతినిధి: యాదాద్రి భువనగిరి
ప్రచురణ: 12 Nov 2026 05:05 PM
వీక్షణలు: 211 Views
పచ్చని వెల్దేవి పల్లెలో చిచ్చు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు: కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య నాగరాజు హెచ్చరిక
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి భువనగిరి): ప్రశాంతంగా ఉన్న అడ్డగూడూరు మండల పరిధిలోని పచ్చని వెల్దేవి గ్రామంలో కుట్రపూరిత రాజకీయాలతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని వెల్దేవి గ్రామపంచాయతీ కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య నాగరాజు తీవ్రంగా హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలపై గురువారం ఆమె ఓ ప్రకటనలో తీవ్రస్థాయిలో స్పందించారు. గతంలోనూ ఇలాంటి కవ్వింపు చర్యల వల్ల గ్రామం అంధకారంలోకి నెట్టబడి వల్లకాడైందని, మళ్లీ అటువంటి విద్వేషపూరిత కుట్రలకు తెర తీస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరని ఆమె స్పష్టం చేశారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి, ఆ కొట్లాటల మంటల్లో చలి కాగుతున్న కొంతమంది స్వార్థపూరిత నాయకుల తీరుపై సంధ్య నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూడను పాలు చీకమని.. బర్రెను తన్నమనే రీతిలో కొందరు నాయకులు వెనుక నుండి నడిపిస్తున్న తీరును గ్రామ ప్రజలు ఎంతో నిశితంగా గమనిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే వారి గుట్టు త్వరలోనే రట్టవుతుందని హెచ్చరించారు. ఏదేమైనా పచ్చని పల్లె ప్రశాంతంగా, సుభిక్షంగా ఉండాలంటే రాజకీయ లబ్ధి కోసం చేసే కుట్రపూరిత, విద్వేషపూరిత, మోసపూరిత కవ్వింపు చర్యలను తక్షణమే విడనాడాలని ఆమె హితవు పలికారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిందిపోయి, వర్గపోరును సృష్టించడం మానుకుని అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించేలా సహకరించాలని రొడ్డ సంధ్య నాగరాజు విజ్ఞప్తి చేశారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
యాదాద్రి భువనగిరి ఎడిషన్ తేదీ: 19-11-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

పచ్చని వెల్దేవి పల్లెలో చిచ్చు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు: కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య నాగరాజు హెచ్చరిక

news image
అడ్డగూడూరు, Nov 19 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి భువనగిరి): ప్రశాంతంగా ఉన్న అడ్డగూడూరు మండల పరిధిలోని పచ్చని వెల్దేవి గ్రామంలో కుట్రపూరిత రాజకీయాలతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని వెల్దేవి గ్రామపంచాయతీ కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య నాగరాజు తీవ్రంగా హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలపై గురువారం ఆమె ఓ ప్రకటనలో తీవ్రస్థాయిలో స్పందించారు. గతంలోనూ ఇలాంటి కవ్వింపు చర్యల వల్ల గ్రామం అంధకారంలోకి నెట్టబడి వల్లకాడైందని, మళ్లీ అటువంటి విద్వేషపూరిత కుట్రలకు తెర తీస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరని ఆమె స్పష్టం చేశారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి, ఆ కొట్లాటల మంటల్లో చలి కాగుతున్న కొంతమంది స్వార్థపూరిత నాయకుల తీరుపై సంధ్య నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూడను పాలు చీకమని.. బర్రెను తన్నమనే రీతిలో కొందరు నాయకులు వెనుక నుండి నడిపిస్తున్న తీరును గ్రామ ప్రజలు ఎంతో నిశితంగా గమనిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే వారి గుట్టు త్వరలోనే రట్టవుతుందని హెచ్చరించారు. ఏదేమైనా పచ్చని పల్లె ప్రశాంతంగా, సుభిక్షంగా ఉండాలంటే రాజకీయ లబ్ధి కోసం చేసే కుట్రపూరిత, విద్వేషపూరిత, మోసపూరిత కవ్వింపు చర్యలను తక్షణమే విడనాడాలని ఆమె హితవు పలికారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిందిపోయి, వర్గపోరును సృష్టించడం మానుకుని అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించేలా సహకరించాలని రొడ్డ సంధ్య నాగరాజు విజ్ఞప్తి చేశారు.