Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు విద్యార్థి జన సమితి వినతి

ప్రతినిధి: Chief Editor
ప్రచురణ: 07 Aug 2026 07:01 AM
వీక్షణలు: 43 Views
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు విద్యార్థి జన సమితి వినతి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్, ఆగస్టు 7): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల యజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండటంతో వారి విద్యాభ్యాసం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు చెరుకు శివరాజ్, విద్యార్థి జన సమితి కార్యదర్శి మాలోత్ రవి కుమార్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలు రాయలేక, సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత విద్య కొనసాగింపులో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు విద్యార్థి జన సమితి వినతి

news image
హైదరాబాద్, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్, ఆగస్టు 7): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల యజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండటంతో వారి విద్యాభ్యాసం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు చెరుకు శివరాజ్, విద్యార్థి జన సమితి కార్యదర్శి మాలోత్ రవి కుమార్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలు రాయలేక, సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత విద్య కొనసాగింపులో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.