మానవత్వం చాటుకున్న పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్
»»» మృతురాలి కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం
»»» ఆపద సమయంలో అండగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్‌కు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపిన మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (కేతెపల్లి/నల్లగొండ): కేతెపల్లి మండలం చేరకుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌లోని పవన్ సాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన పోకల నవనీత కుటుంబాన్ని బుధవారం పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త పోకల మోహన్ రావుని, వారి ముగ్గురు చిన్న పిల్లలను కలసి ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తన మానవతా దృక్పథాన్ని చాటుతూ మృతురాలి కుటుంబానికి రూ. 10,000/- (పది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి మృతురాలి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.