Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS

తెలంగాణ - తాజా వార్తలు

thumb
గ్రామీణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి సీతక్క

»» త్వరలోనే ‘హ్యామ్’ (HAM) రహదారుల పనులు ప్రారంభం»» ఆగస్టు 15 నాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం»» సచివాలయంలో హ్యామ్ రోడ్ల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్షప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): పట్టణ ప్రాంత రహదారులకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని, అందుకోసమే అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానాన్ని అవలంబిస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్, ఈఎన్సీ జోగారెడ్డి, సీఈలతో కలిసి గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని వెల్లడించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హ్యామ్ మోడల్‌లో మొత్తంగా 6,703 గ్రామాల్లో 18,472 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి విడత కింద 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని, వీటిలో 90 శాతం పనులు ప్రస్తుతం ఉన్న రహదారుల ఆధునీకరణకే ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల మేర బిటి, సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కోన్నారు.తెలంగాణలో అమలు చేస్తున్న హ్యామ్ విధానాన్ని దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నందున మార్గదర్శకాలను అత్యంత సమగ్రంగా రూపొందించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆర్బీఐ అనుమతులు వచ్చే వారంలోగా పూర్తి స్థాయిలో రానున్నాయని, ఆగస్టు 15 నాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రిమెంట్లు కాగానే కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించాలని, టెండర్లు దక్కించుకోవడంలో చూపిన ఉత్సాహం పనులు పూర్తి చేయడంలోనూ చూపాలని స్పష్టం చేశారు. పనులను సొంత బాధ్యతగా స్వీకరించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.గతంలో సింగిల్ రోడ్డు ఉన్న చోట కూడా ఇప్పుడు భారీ వాహనాలు వెళ్లేలా నాణ్యతతో రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. పనుల్లో ఆలస్యం లేకుండా భూసమీకరణ, చెట్ల తొలగింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలన్నారు. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని, అటవీ భూములు ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక అధికారుల సహాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

thumb
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజన వసతి, దివీస్, అరబిందో' సంస్థల రూ.22.18 కోట్ల భారీ విరాళం

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి నాణ్యమైన టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమానికి ప్రముఖ ఫార్మా దిగ్గజాలు 'దివీస్ లాబొరేటరీస్', 'అరబిందో ఫార్మా' భాగస్వామ్యమయ్యాయి. ప్రభుత్వ సత్సంకల్పానికి మద్దతుగా నిలుస్తున్న 'హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్' కు ఈ రెండు సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద భారీ విరాళాన్ని ప్రకటించాయి. లక్షలాది మంది పేద విద్యార్థుల ఆకలి తీర్చే ఈ అక్షయ పాత్ర వంటి కార్యక్రమం కోసం:దివీస్ లాబొరేటరీస్: రూ. 12.18 కోట్లుఅరబిందో ఫార్మా లిమిటెడ్: రూ. 10 కోట్లుమొత్తంగా రూ. 22.18 కోట్ల ఆర్థక సాయాన్ని ఫౌండేషన్‌కు అందజేశాయి.ఈ సందర్భంగా పేద విద్యార్థుల పోషకాహార లోపాన్ని నివారించి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న దివీస్, అరబిందో యాజమాన్యాలకు మరియు హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విద్యా వ్యవస్థను బలపరచడంలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

thumb
ధరణి లోపాలపై 'సిట్' విచారణ: చారుసిన్హా నేతృత్వంలో ప్రత్యేక బృందం

(హైదరాబాద్ , తెలంగాణ): రాష్ట్రంలో గతంలో నిర్వహించిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ రికార్డుల ట్యాంపరింగ్, అక్రమ భూ మార్పిడులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ధరణి ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు వరకు జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ​ఈ 'సిట్' బృందానికి ఏసీబీ అదనపు డీజీ చారు సిన్హా నేతృత్వం వహించనుండగా, బృందంలో రెవెన్యూ అధికారులు, ఐటీ నిపుణులు, సైబర్ క్రైమ్ విచారణలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను సభ్యులుగా చేర్చనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.​ప్రధానంగా విచారించే అంశాలు: ​10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు: కేరళ ప్రభుత్వ సంస్థ (KSAAC) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగుచూసిన 10,000 కంటే ఎక్కువ వివాదాస్పద లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ​22A దుర్వినియోగం: పేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, సీలింగ్ భూములను నిషేధిత జాబితా (22A) నుంచి అక్రమంగా తొలగించి బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారాలను సర్వే నంబర్ల వారీగా పరిశీలిస్తారు. ​రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ అక్రమాలు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే అత్యధికంగా ప్రభుత్వ, సీలింగ్ భూములు చేతులు మారినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారిపైనైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

thumb
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం: తుపాకీతో కాల్చుకుని స్వామి అనే కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం: తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 5:30 గంటల సమయంలో కానిస్టేబుల్ స్వామి వాష్‌రూమ్‌కు వెళ్లి, అక్కడ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. తుపాకీ శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోగా, స్వామి రక్తమడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నా భార్య, పిల్లలను ఏమీ అనవద్దు" అని స్వామి రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే స్వామి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

thumb
నిరంతర అప్రమత్తతే సురక్షితం.. చర్లపల్లి లో మల్కాజ్గిరి పోలీసులు మాక్ డ్రిల్

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ మేడ్చల్ మల్కాజ్గిరి (చర్లపల్లి):: అత్యవసర సమయాల్లో భద్రతా వ్యవస్థల సన్నద్ధతను పరీక్షించేందుకు చర్లపల్లిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రాంగణంలో మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ సందర్భంగా అత్యంత కీలకమైన ఈ సంస్థ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఏదైనా ఆకస్మిక ప్రమాదం లేదా భద్రతా సమస్య తలెత్తితే వేగంగా స్పందించేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లను మరియు పోలీసు బలగాల సన్నద్ధతను అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు మాట్లాడుతూ... "సురక్షిత సమాజ స్థాపన కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండటమే మా మొదటి ప్రాధాన్యం. అప్రమత్తతే రక్షణకు మూలస్తంభం" అని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

thumb
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అధ్యాపకులు మందలించారంటూ.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

(తెలంగాణ): హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అధ్యాపకులు మందలించారంటూ.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య