Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

నిరంతర అప్రమత్తతే సురక్షితం.. చర్లపల్లి లో మల్కాజ్గిరి పోలీసులు మాక్ డ్రిల్

ప్రతినిధి: మేడ్చల్ - మల్కాజ్‌గిరి
ప్రచురణ: 23 Jul 2026 04:10 AM
వీక్షణలు: 24 Views
నిరంతర అప్రమత్తతే సురక్షితం.. చర్లపల్లి లో మల్కాజ్గిరి పోలీసులు మాక్ డ్రిల్
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ మేడ్చల్ మల్కాజ్గిరి (చర్లపల్లి):: అత్యవసర సమయాల్లో భద్రతా వ్యవస్థల సన్నద్ధతను పరీక్షించేందుకు చర్లపల్లిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రాంగణంలో మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ సందర్భంగా అత్యంత కీలకమైన ఈ సంస్థ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఏదైనా ఆకస్మిక ప్రమాదం లేదా భద్రతా సమస్య తలెత్తితే వేగంగా స్పందించేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లను మరియు పోలీసు బలగాల సన్నద్ధతను అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు మాట్లాడుతూ... "సురక్షిత సమాజ స్థాపన కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండటమే మా మొదటి ప్రాధాన్యం. అప్రమత్తతే రక్షణకు మూలస్తంభం" అని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
మేడ్చల్ మల్కాజ్గిరి ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

నిరంతర అప్రమత్తతే సురక్షితం.. చర్లపల్లి లో మల్కాజ్గిరి పోలీసులు మాక్ డ్రిల్

news image
మేడ్చల్ మల్కాజ్గిరి, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ మేడ్చల్ మల్కాజ్గిరి (చర్లపల్లి):: అత్యవసర సమయాల్లో భద్రతా వ్యవస్థల సన్నద్ధతను పరీక్షించేందుకు చర్లపల్లిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రాంగణంలో మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ సందర్భంగా అత్యంత కీలకమైన ఈ సంస్థ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఏదైనా ఆకస్మిక ప్రమాదం లేదా భద్రతా సమస్య తలెత్తితే వేగంగా స్పందించేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లను మరియు పోలీసు బలగాల సన్నద్ధతను అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు మాట్లాడుతూ... "సురక్షిత సమాజ స్థాపన కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండటమే మా మొదటి ప్రాధాన్యం. అప్రమత్తతే రక్షణకు మూలస్తంభం" అని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.