Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

ధరణి లోపాలపై 'సిట్' విచారణ: చారుసిన్హా నేతృత్వంలో ప్రత్యేక బృందం

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 25 Jul 2026 11:56 AM
వీక్షణలు: 24 Views
ధరణి లోపాలపై 'సిట్' విచారణ: చారుసిన్హా నేతృత్వంలో ప్రత్యేక బృందం

(హైదరాబాద్ , తెలంగాణ): రాష్ట్రంలో గతంలో నిర్వహించిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ రికార్డుల ట్యాంపరింగ్, అక్రమ భూ మార్పిడులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ధరణి ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు వరకు జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ​ఈ 'సిట్' బృందానికి ఏసీబీ అదనపు డీజీ చారు సిన్హా నేతృత్వం వహించనుండగా, బృందంలో రెవెన్యూ అధికారులు, ఐటీ నిపుణులు, సైబర్ క్రైమ్ విచారణలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను సభ్యులుగా చేర్చనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.

​ప్రధానంగా విచారించే అంశాలు:

  • 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు: కేరళ ప్రభుత్వ సంస్థ (KSAAC) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగుచూసిన 10,000 కంటే ఎక్కువ వివాదాస్పద లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
  • 22A దుర్వినియోగం: పేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, సీలింగ్ భూములను నిషేధిత జాబితా (22A) నుంచి అక్రమంగా తొలగించి బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారాలను సర్వే నంబర్ల వారీగా పరిశీలిస్తారు.
  • రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ అక్రమాలు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే అత్యధికంగా ప్రభుత్వ, సీలింగ్ భూములు చేతులు మారినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారిపైనైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ధరణి లోపాలపై 'సిట్' విచారణ: చారుసిన్హా నేతృత్వంలో ప్రత్యేక బృందం

news image
హైదరాబాద్ , Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): (హైదరాబాద్ , తెలంగాణ): రాష్ట్రంలో గతంలో నిర్వహించిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ రికార్డుల ట్యాంపరింగ్, అక్రమ భూ మార్పిడులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ధరణి ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు వరకు జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ​ఈ 'సిట్' బృందానికి ఏసీబీ అదనపు డీజీ చారు సిన్హా నేతృత్వం వహించనుండగా, బృందంలో రెవెన్యూ అధికారులు, ఐటీ నిపుణులు, సైబర్ క్రైమ్ విచారణలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను సభ్యులుగా చేర్చనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.​ప్రధానంగా విచారించే అంశాలు: ​10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు: కేరళ ప్రభుత్వ సంస్థ (KSAAC) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగుచూసిన 10,000 కంటే ఎక్కువ వివాదాస్పద లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ​22A దుర్వినియోగం: పేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, సీలింగ్ భూములను నిషేధిత జాబితా (22A) నుంచి అక్రమంగా తొలగించి బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారాలను సర్వే నంబర్ల వారీగా పరిశీలిస్తారు. ​రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ అక్రమాలు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే అత్యధికంగా ప్రభుత్వ, సీలింగ్ భూములు చేతులు మారినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారిపైనైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.