తెలంగాణ
బ్రేకింగ్
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం: తుపాకీతో కాల్చుకుని స్వామి అనే కానిస్టేబుల్ ఆత్మహత్య
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం: తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 5:30 గంటల సమయంలో కానిస్టేబుల్ స్వామి వాష్‌రూమ్‌కు వెళ్లి, అక్కడ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. తుపాకీ శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోగా, స్వామి రక్తమడుగులో పడి ఉన్నారు.
ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నా భార్య, పిల్లలను ఏమీ అనవద్దు" అని స్వామి రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే స్వామి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.