Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజన వసతి, దివీస్, అరబిందో' సంస్థల రూ.22.18 కోట్ల భారీ విరాళం

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 25 Jul 2026 12:14 PM
వీక్షణలు: 24 Views
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజన వసతి, దివీస్, అరబిందో' సంస్థల రూ.22.18 కోట్ల భారీ విరాళం

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి నాణ్యమైన టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమానికి ప్రముఖ ఫార్మా దిగ్గజాలు 'దివీస్ లాబొరేటరీస్', 'అరబిందో ఫార్మా' భాగస్వామ్యమయ్యాయి. ప్రభుత్వ సత్సంకల్పానికి మద్దతుగా నిలుస్తున్న 'హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్' కు ఈ రెండు సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద భారీ విరాళాన్ని ప్రకటించాయి. లక్షలాది మంది పేద విద్యార్థుల ఆకలి తీర్చే ఈ అక్షయ పాత్ర వంటి కార్యక్రమం కోసం:

దివీస్ లాబొరేటరీస్: రూ. 12.18 కోట్లు

అరబిందో ఫార్మా లిమిటెడ్: రూ. 10 కోట్లు

మొత్తంగా రూ. 22.18 కోట్ల ఆర్థక సాయాన్ని ఫౌండేషన్‌కు అందజేశాయి.

ఈ సందర్భంగా పేద విద్యార్థుల పోషకాహార లోపాన్ని నివారించి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న దివీస్, అరబిందో యాజమాన్యాలకు మరియు హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విద్యా వ్యవస్థను బలపరచడంలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజన వసతి, దివీస్, అరబిందో' సంస్థల రూ.22.18 కోట్ల భారీ విరాళం

news image
హైదరాబాద్ , Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి నాణ్యమైన టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమానికి ప్రముఖ ఫార్మా దిగ్గజాలు 'దివీస్ లాబొరేటరీస్', 'అరబిందో ఫార్మా' భాగస్వామ్యమయ్యాయి. ప్రభుత్వ సత్సంకల్పానికి మద్దతుగా నిలుస్తున్న 'హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్' కు ఈ రెండు సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద భారీ విరాళాన్ని ప్రకటించాయి. లక్షలాది మంది పేద విద్యార్థుల ఆకలి తీర్చే ఈ అక్షయ పాత్ర వంటి కార్యక్రమం కోసం:దివీస్ లాబొరేటరీస్: రూ. 12.18 కోట్లుఅరబిందో ఫార్మా లిమిటెడ్: రూ. 10 కోట్లుమొత్తంగా రూ. 22.18 కోట్ల ఆర్థక సాయాన్ని ఫౌండేషన్‌కు అందజేశాయి.ఈ సందర్భంగా పేద విద్యార్థుల పోషకాహార లోపాన్ని నివారించి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న దివీస్, అరబిందో యాజమాన్యాలకు మరియు హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విద్యా వ్యవస్థను బలపరచడంలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.