Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి / నాగారం/ సూర్యాపేట:అజ్ఞానపు చీకట్లను పారద్రోలి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆదర్శ గురువు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఊట్కూరు స్వామి ఆయన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పసునూరు గ్రామంలో బుధవారం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న శిష్యులు, గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.హుటాహుటిన చేరుకున్న శిష్యుడు డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగగ్రామానికి చెందిన ఊట్కూరు స్వామి వద్దే ప్రాథమిక విద్యాబుద్ధులు నేర్చుకొని, ప్రస్తుతం సమాజంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మార్పీఎస్ కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ ఈ వార్త వినగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విషయం తెలియగానే హుటాహుటిన పసునూరు గ్రామానికి చేరుకుని తన ప్రియతమ గురువు పార్థివదేహాన్ని దర్శించుకున్నారు.కన్నీటి వీడ్కోలు – గళంతో భావోద్వేగ నివాళిగురువు భౌతికకాయం వద్ద డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ బోరున విలపించారు. ఆయన పార్థివదేహంపై పూలమాలలు వేసి పాదాభివందనం చేశారు. అనంతరం తన గొంతుతో గురువు జ్ఞాపకాలను, ఆయన అందించిన జ్ఞానాన్ని స్మరిస్తూ హృదయాలను కదిలించేలా శ్రద్ధాంజలి గీతాన్ని ఆలపించారు. ఆయన పాడిన పాట అక్కడున్న గ్రామస్తులను, బంధువులను కంటతడి పెట్టించింది.నా గురువు సేవలు చిరస్మరణీయం: డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగఈ సందర్భంగా డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ నాకు అక్షరాలతో పాటు సమాజంలో ఎలా జీవించాలో నేర్పిన మహోన్నత వ్యక్తి ఊట్కూరు స్వామి సార్. ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన నిస్వార్థ ఉపాధ్యాయులు. వారి క్రమశిక్షణ, బోధన నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఆయన మరణం పసునూరు గ్రామానికే కాకుండా యావత్ విద్యా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఎస్సీ ఎడిటర్స్ & జర్నలిస్టుల ఫోరం జాతియ అధ్యక్షులు రొడ్డ నాగరాజు (RNR), ఎమ్మార్పీఎస్ నాయకులు బాలెంల బుచ్చిమల్లు, ఏపూరి గలం సభ్యులు ఏపూరి యాకన్న, చింతకుంట్ల పరమేష్, గ్రామ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ఊట్కూరు స్వామి పార్థివదేహానికి నివాళులర్పించారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట/ తుంగతుర్తి ఆగస్టు 21): తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్, MEF సీనియర్ నాయకులు మల్లెపాక వెంకన్న, ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర నాయకులు మల్లెపాక నాగర్జున ల తండ్రి మల్లెపాక బిక్షం (21/08/2026) న మధ్యాహ్నం 12:05 గంటలకు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బిక్షం గారి మరణవార్త తెలియగానే ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్ఎఫ్ (MSF), MEF, ఎమ్మార్పీఎస్ కళామండలి, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మల్లెపాక కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని పసునూరు గ్రామంలో రేపు శనివారం ఉదయం 11 గంటలకు బిక్షం అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు వివిధ సంఘాల నేతలు తెలిపారు. మల్లెపాక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ మరియు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘ ప్రతినిధులు కోరారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి భువనగిరి/ మోత్కూరు): మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఎలిమినేటి సంతోష్ ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. స్నేహితుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మిత్రులంతా కలిసి రూ.1.40 లక్షల ఆర్థిక సాయాన్ని సేకరించి, సోమవారం సంతోష్ భార్య రజితకు అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. సంతోష్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి తమవంతు బాధ్యతగా ఈ ఆర్థిక సాయం అందించామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంతోష్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మేడ్చల్ మల్కాజ్గిరి/ పోచారం): పోచారం పరిధిలోని ఏవీ వినూత్న హోమ్స్‌లో బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను నివాసితులు కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరూ పోచారం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఏవీ వినూత్న హోమ్స్‌లో తొలిసారిగా బోనాల పండుగను ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో కాలనీ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, భక్తుల సందడి, మహిళల సంప్రదాయ బోనాలతో ఏవీ వినూత్న హోమ్స్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. భక్తి, సంప్రదాయం, ఆత్మీయతల కలయికగా సాగిన ఈ బోనాల వేడుకలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుని విజయవంతంగా ముగిశాయి.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి-భువనగిరి/ అడ్డగూడూర్): మండల పరిధిలోని వెల్దేవి, చౌళ్ళగూడెం గ్రామంలో గ్రామదేవత పెద్ద మైసమ్మ బోనాల పండుగ ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళలు తెల్లవారుజాము నుంచే పవిత్రంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. నియమ నిష్టలతో అమ్మవారికి నైవేద్యంగా బోనం వండి, పసుపు, కుంకుమ, వేపకొమ్మలు, దీపాలతో బోనాలను అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పుసప్పుల్ల నడుమ ఊరేగింపుగా గ్రామదేవత పెద్ద మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కొలువైన అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, భక్తులు, బందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్/ఉప్పల్): ఉప్పల్ భగాయత్‌లోని ప్రముఖ విద్యాసంస్థ ‘ది హైదరాబాద్ లా కాలేజీ’ ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కె. భూపతి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో న్యాయ విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు విద్యార్థులు చిప్పలపల్లి యాదగిరి, చంద్రస్వామి, సంతోష్ రెడ్డి, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (తుంగతుర్తి/తిరుమలగిరి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి, పతాకానికి ఘనంగా వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో మహనీయుల, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని కొనియాడారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ, దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సంగారెడ్డి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, స్వర్గీయ రాజీవ్ గాంధీల విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహాల ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . ఆధునిక భారతదేశ నిర్మాణంలో, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీలు చేసిన విశేష సేవలను, వారి త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్, టీజీఐఐసీ (TGIIC) చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, నీలం మధు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. . వీరితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంతో సంగారెడ్డి పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.