Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ

వెల్దేవి గ్రామంలో ఘనంగా గ్రామదేవత బోనాల ఉత్సవాలు

ప్రతినిధి: యాదాద్రి భువనగిరి
ప్రచురణ: 17 Aug 2026 05:40 AM
వీక్షణలు: 154 Views
వెల్దేవి గ్రామంలో ఘనంగా గ్రామదేవత బోనాల ఉత్సవాలు

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి-భువనగిరి/ అడ్డగూడూర్): మండల పరిధిలోని వెల్దేవి, చౌళ్ళగూడెం గ్రామంలో గ్రామదేవత పెద్ద మైసమ్మ బోనాల పండుగ ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళలు తెల్లవారుజాము నుంచే పవిత్రంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. నియమ నిష్టలతో అమ్మవారికి నైవేద్యంగా బోనం వండి, పసుపు, కుంకుమ, వేపకొమ్మలు, దీపాలతో బోనాలను అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పుసప్పుల్ల నడుమ ఊరేగింపుగా గ్రామదేవత పెద్ద మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కొలువైన అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, భక్తులు, బందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
యాదాద్రి భువనగిరి ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

వెల్దేవి గ్రామంలో ఘనంగా గ్రామదేవత బోనాల ఉత్సవాలు

news image
యాదాద్రి భువనగిరి, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి-భువనగిరి/ అడ్డగూడూర్): మండల పరిధిలోని వెల్దేవి, చౌళ్ళగూడెం గ్రామంలో గ్రామదేవత పెద్ద మైసమ్మ బోనాల పండుగ ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళలు తెల్లవారుజాము నుంచే పవిత్రంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. నియమ నిష్టలతో అమ్మవారికి నైవేద్యంగా బోనం వండి, పసుపు, కుంకుమ, వేపకొమ్మలు, దీపాలతో బోనాలను అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పుసప్పుల్ల నడుమ ఊరేగింపుగా గ్రామదేవత పెద్ద మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కొలువైన అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, భక్తులు, బందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.