Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ

ఓయూలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 07 Aug 2026 06:08 AM
వీక్షణలు: 29 Views
ఓయూలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ): ఉస్మానియా యూనివర్సిటీ లోని ప్రసిద్ధ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ పిలుపు మేరకు, ఓయూ అధ్యక్షుడు చెరుకు శివరాజ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, భావజాల వ్యాప్తిలోనూ జయశంకర్ సార్ పోషించిన పాత్ర స్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, జంగిలి దర్శన్, విద్యార్థి జన సమితి నాయకుడు శివతో పాటు పలువురు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ఓయూలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

news image
హైదరాబాద్ , Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ): ఉస్మానియా యూనివర్సిటీ లోని ప్రసిద్ధ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ పిలుపు మేరకు, ఓయూ అధ్యక్షుడు చెరుకు శివరాజ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, భావజాల వ్యాప్తిలోనూ జయశంకర్ సార్ పోషించిన పాత్ర స్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, జంగిలి దర్శన్, విద్యార్థి జన సమితి నాయకుడు శివతో పాటు పలువురు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.