Copyrights Reserved © 2026
prajayuddanouka.com
★ వెల్దేవి (చౌళ్లగూడెం)లో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు★ విగ్రహ దాత చిలుకూరి కవిత - నాగార్జున దంపతులు, పూజా సామాగ్రి దాత, కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య - నాగరాజు దంపతులకు ఆత్మీయ సన్మానంప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ యాదాద్రి భువనగిరి/ అడ్డగూడూర్: వెల్దేవి (చౌళ్లగూడెం) గ్రామంలో శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని వితరణగా అందజేసిన దాతలు చిలుకూరి కవిత - నాగార్జున దంపతులను, అలాగే పూజా కార్యక్రమాలకు అవసరమైన పూర్తి సామాగ్రిని సమకూర్చిన దాత, కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య - నాగరాజు దంపతులను కమిటీ సభ్యులు బుధవారం రాత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సహకారం కావాలని తాము అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా, ఎంతో ఉదార మనసుతో తక్షణమే స్పందించి విగ్రహాన్ని, పూజా సామాగ్రిని అందజేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామంలో జరిగే దైవ కార్యాలకు, సామాజిక కార్యక్రమాలకు ముందుకొచ్చి చేయూతనందించే వీరి సేవా భావం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తమ పిలుపును మన్నించి ఉత్సవాల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందించిన దాతలకు కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విఘ్నాధిపతి ఆశీస్సులతో వారి కుటుంబాలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ ప్రతినిధులు నీర్మల సందీప్, ఊడుగుకు అశోక్, బోడ గణేష్, నీర్మల శివ, మిట్టగడుపుల యాదగిరి, రొడ్డ శ్రీనివాస్ లు, గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆలయ పాలక వర్గం దర్శనం మరియు వసతులపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ విధానంలో దర్శన టోకెన్లు, సమయం ఖరారు వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో పరిపాలనా వ్యవహారాల్లో భారీ మార్పులు చేసి పూర్తి స్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.ఉద్యోగుల్లో కలకలం రేపిన అంతర్గత బదిలీలుశ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టారు. ఇప్పటికే దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పలు నిర్ణయాలు అమలు చేస్తుండగా, తాజా బదిలీలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. »» ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. »» పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. »» ప్రస్తుత మార్పులతో పాటు రాబోయే రోజుల్లో మరికొందరి బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.అధికారుల తాజా ఉత్తర్వుల వివరాలుతాజా ఉత్తర్వుల మేరకు ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు సహా మొత్తం 23 మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించారు: »» కర్నూలు సమాచార కేంద్రంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఫణిధర్ ప్రసాద్‌ను శ్రీశైలం దేవస్థానం పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. »» ముగ్గురు ఏఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. »» మరో ఇద్దరు ఏఈవోలను ప్రస్తుతం నిర్వహిస్తున్న విభాగాల్లోనే కొనసాగిస్తూనే, అదనపు విధులను అప్పగించారు. »» వీటితో పాటు 17 మంది పర్యవేక్షకులను కూడా వివిధ విభాగాలకు మార్చారు.అన్ని విభాగాల్లోనూ పారదర్శకత పెంచుతూ, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.