Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
భక్తి బ్రేకింగ్

శ్రీశైల ఆలయంలో భారీ ప్రక్షాళన - కీలక నిర్ణయాలు

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 02 Aug 2026 10:13 AM
వీక్షణలు: 24 Views
శ్రీశైల ఆలయంలో భారీ ప్రక్షాళన - కీలక నిర్ణయాలు

ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆలయ పాలక వర్గం దర్శనం మరియు వసతులపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ విధానంలో దర్శన టోకెన్లు, సమయం ఖరారు వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో పరిపాలనా వ్యవహారాల్లో భారీ మార్పులు చేసి పూర్తి స్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

ఉద్యోగుల్లో కలకలం రేపిన అంతర్గత బదిలీలు

శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టారు. ఇప్పటికే దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పలు నిర్ణయాలు అమలు చేస్తుండగా, తాజా బదిలీలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 »» ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 »» పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

 »» ప్రస్తుత మార్పులతో పాటు రాబోయే రోజుల్లో మరికొందరి బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.

అధికారుల తాజా ఉత్తర్వుల వివరాలు

తాజా ఉత్తర్వుల మేరకు ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు సహా మొత్తం 23 మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించారు:

 »» కర్నూలు సమాచార కేంద్రంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఫణిధర్ ప్రసాద్‌ను శ్రీశైలం దేవస్థానం పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు.

 »» ముగ్గురు ఏఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించారు.

 »» మరో ఇద్దరు ఏఈవోలను ప్రస్తుతం నిర్వహిస్తున్న విభాగాల్లోనే కొనసాగిస్తూనే, అదనపు విధులను అప్పగించారు.

 »» వీటితో పాటు 17 మంది పర్యవేక్షకులను కూడా వివిధ విభాగాలకు మార్చారు.

అన్ని విభాగాల్లోనూ పారదర్శకత పెంచుతూ, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.


ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

శ్రీశైల ఆలయంలో భారీ ప్రక్షాళన - కీలక నిర్ణయాలు

news image
హైదరాబాద్, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆలయ పాలక వర్గం దర్శనం మరియు వసతులపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ విధానంలో దర్శన టోకెన్లు, సమయం ఖరారు వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో పరిపాలనా వ్యవహారాల్లో భారీ మార్పులు చేసి పూర్తి స్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.ఉద్యోగుల్లో కలకలం రేపిన అంతర్గత బదిలీలుశ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టారు. ఇప్పటికే దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పలు నిర్ణయాలు అమలు చేస్తుండగా, తాజా బదిలీలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. »» ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. »» పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. »» ప్రస్తుత మార్పులతో పాటు రాబోయే రోజుల్లో మరికొందరి బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.అధికారుల తాజా ఉత్తర్వుల వివరాలుతాజా ఉత్తర్వుల మేరకు ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు సహా మొత్తం 23 మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించారు: »» కర్నూలు సమాచార కేంద్రంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఫణిధర్ ప్రసాద్‌ను శ్రీశైలం దేవస్థానం పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. »» ముగ్గురు ఏఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. »» మరో ఇద్దరు ఏఈవోలను ప్రస్తుతం నిర్వహిస్తున్న విభాగాల్లోనే కొనసాగిస్తూనే, అదనపు విధులను అప్పగించారు. »» వీటితో పాటు 17 మంది పర్యవేక్షకులను కూడా వివిధ విభాగాలకు మార్చారు.అన్ని విభాగాల్లోనూ పారదర్శకత పెంచుతూ, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.