Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
భక్తి బ్రేకింగ్

వెల్దేవి గ్రామంలో వినాయకుడి విగ్రహ, పూజా సామాగ్రి దాతలకు ఘన సత్కారం

ప్రతినిధి: యాదాద్రి భువనగిరి
ప్రచురణ: 24 Sep 2026 04:13 PM
వీక్షణలు: 267 Views
వెల్దేవి గ్రామంలో వినాయకుడి విగ్రహ, పూజా సామాగ్రి దాతలకు ఘన సత్కారం

★ వెల్దేవి (చౌళ్లగూడెం)లో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు

★ విగ్రహ దాత చిలుకూరి కవిత - నాగార్జున దంపతులు, పూజా సామాగ్రి దాత, కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య - నాగరాజు దంపతులకు ఆత్మీయ సన్మానం

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ యాదాద్రి భువనగిరి/ అడ్డగూడూర్: వెల్దేవి (చౌళ్లగూడెం) గ్రామంలో శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని వితరణగా అందజేసిన దాతలు చిలుకూరి కవిత - నాగార్జున దంపతులను, అలాగే పూజా కార్యక్రమాలకు అవసరమైన పూర్తి సామాగ్రిని సమకూర్చిన దాత, కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య - నాగరాజు దంపతులను కమిటీ సభ్యులు బుధవారం రాత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సహకారం కావాలని తాము అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా, ఎంతో ఉదార మనసుతో తక్షణమే స్పందించి విగ్రహాన్ని, పూజా సామాగ్రిని అందజేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామంలో జరిగే దైవ కార్యాలకు, సామాజిక కార్యక్రమాలకు ముందుకొచ్చి చేయూతనందించే వీరి సేవా భావం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తమ పిలుపును మన్నించి ఉత్సవాల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందించిన దాతలకు కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విఘ్నాధిపతి ఆశీస్సులతో వారి కుటుంబాలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ ప్రతినిధులు నీర్మల సందీప్, ఊడుగుకు అశోక్, బోడ గణేష్, నీర్మల శివ, మిట్టగడుపుల యాదగిరి, రొడ్డ శ్రీనివాస్ లు, గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 11-10-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

వెల్దేవి గ్రామంలో వినాయకుడి విగ్రహ, పూజా సామాగ్రి దాతలకు ఘన సత్కారం

news image
హైదరాబాద్, Oct 11 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ★ వెల్దేవి (చౌళ్లగూడెం)లో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు★ విగ్రహ దాత చిలుకూరి కవిత - నాగార్జున దంపతులు, పూజా సామాగ్రి దాత, కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య - నాగరాజు దంపతులకు ఆత్మీయ సన్మానంప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ యాదాద్రి భువనగిరి/ అడ్డగూడూర్: వెల్దేవి (చౌళ్లగూడెం) గ్రామంలో శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని వితరణగా అందజేసిన దాతలు చిలుకూరి కవిత - నాగార్జున దంపతులను, అలాగే పూజా కార్యక్రమాలకు అవసరమైన పూర్తి సామాగ్రిని సమకూర్చిన దాత, కాంటెస్టెడ్ సర్పంచ్ రొడ్డ సంధ్య - నాగరాజు దంపతులను కమిటీ సభ్యులు బుధవారం రాత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సహకారం కావాలని తాము అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా, ఎంతో ఉదార మనసుతో తక్షణమే స్పందించి విగ్రహాన్ని, పూజా సామాగ్రిని అందజేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామంలో జరిగే దైవ కార్యాలకు, సామాజిక కార్యక్రమాలకు ముందుకొచ్చి చేయూతనందించే వీరి సేవా భావం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తమ పిలుపును మన్నించి ఉత్సవాల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందించిన దాతలకు కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విఘ్నాధిపతి ఆశీస్సులతో వారి కుటుంబాలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ ప్రతినిధులు నీర్మల సందీప్, ఊడుగుకు అశోక్, బోడ గణేష్, నీర్మల శివ, మిట్టగడుపుల యాదగిరి, రొడ్డ శ్రీనివాస్ లు, గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.