Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
క్రీడలు బ్రేకింగ్

రాష్ట్ర స్థాయి అండర్-19 వాలీబాల్ జట్టుకు ఎంపికైన రొడ్డ హారిక

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 11 Oct 2026 02:42 AM
వీక్షణలు: 351 Views
రాష్ట్ర స్థాయి అండర్-19 వాలీబాల్ జట్టుకు ఎంపికైన రొడ్డ హారిక

★ గురుకుల ప్రతిభకు పట్టం.. వాలీబాల్ రాష్ట్ర జట్టులో వెల్దేవి బిడ్డ హారిక

★ కఠోర శ్రమతో అండర్-19 పోటీల్లో స్థానం.. జాతీయ జట్టులోకి దూసుకెళ్లే దిశగా సాధన

★ గురుకులాల నుంచి రాష్ట్ర వేదికపైకి ఎదిగిన ప్రతిభ

★ SGF పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున ప్రతిభావంతమైన ప్రదర్శన

★ తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురుకుల శిక్షణ

★ కోచ్‌ల మార్గదర్శకత్వంలో రాటుదేలిన ప్రతిభ

★ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా పోటీల ప్రారంభం

★ జాతీయ జట్టు బెర్త్‌పై గురి.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థుల హర్షం

ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి/అడ్డగూడూర్/ వెల్దేవి: కఠోర సాధన, పట్టుదల ఉంటే పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపించింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గ్రామీణ క్రీడాకారిణి రొడ్డ హారిక. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఆమె ఎంపికై తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.

పేద కుటుంబం నుంచి రాష్ట్ర స్థాయి వేదికపైకి

అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన సీనియర్ జర్నలిస్ట్ రొడ్డ నాగరాజు, సంధ్య దంపతుల ప్రథమ కుమార్తె రొడ్డ హారిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. 5వ తరగతి నుంచి మహీంద్రాహిల్స్ హైదరాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తూనే వాలీబాల్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.

తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా చింతకుంటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాలీబాల్ అకాడమీలో చేరి, కోచ్ సతీష్ సారథ్యంలో రెండేళ్లపాటు కఠిన శిక్షణ పొందింది. ఆటలోని మెలకువలను ఒంటపట్టించుకుని ప్రతిభావంతమైన క్రీడాకారిణిగా ఎదిగింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న హారిక, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ప్రేమలత మార్గదర్శకత్వంలో మరింతగా రాటుదేలింది. కళాశాల తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధిగా రాష్ట్ర స్థాయి జట్టులో స్థానం దక్కించుకుంది.

అట్టహాసంగా ప్రారంభమైన పోటీలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రంగారెడ్డిగూడలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులు, గురువులు, పుట్టి పెరిగిన ఊరు, రాష్ట్రం మరియు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.

జాతీయ జట్టు ఎంపికపై దృష్టి

రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నారు. బాలికల జట్టు అబ్జర్వర్ జక్కయ్య, బాలుర జట్టు అబ్జర్వర్ పర్వతాలు గౌడ్ ల పర్యవేక్షణలో నేడు ప్రతిభావంతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో తనదైన శైలిలో రాణిస్తున్న హారిక, జాతీయ జట్టుకు సైతం ఎంపికవుతుందనే నమ్మకాన్ని కోచ్‌లు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. హారిక సాధించిన ఈ విజయం పట్ల వెల్దేవి గ్రామస్థులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 11-10-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

రాష్ట్ర స్థాయి అండర్-19 వాలీబాల్ జట్టుకు ఎంపికైన రొడ్డ హారిక

news image
హైదరాబాద్, Oct 11 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ★ గురుకుల ప్రతిభకు పట్టం.. వాలీబాల్ రాష్ట్ర జట్టులో వెల్దేవి బిడ్డ హారిక★ కఠోర శ్రమతో అండర్-19 పోటీల్లో స్థానం.. జాతీయ జట్టులోకి దూసుకెళ్లే దిశగా సాధన★ గురుకులాల నుంచి రాష్ట్ర వేదికపైకి ఎదిగిన ప్రతిభ★ SGF పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున ప్రతిభావంతమైన ప్రదర్శన★ తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురుకుల శిక్షణ★ కోచ్‌ల మార్గదర్శకత్వంలో రాటుదేలిన ప్రతిభ★ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా పోటీల ప్రారంభం★ జాతీయ జట్టు బెర్త్‌పై గురి.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థుల హర్షంప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి/అడ్డగూడూర్/ వెల్దేవి: కఠోర సాధన, పట్టుదల ఉంటే పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపించింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గ్రామీణ క్రీడాకారిణి రొడ్డ హారిక. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఆమె ఎంపికై తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.పేద కుటుంబం నుంచి రాష్ట్ర స్థాయి వేదికపైకిఅడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన సీనియర్ జర్నలిస్ట్ రొడ్డ నాగరాజు, సంధ్య దంపతుల ప్రథమ కుమార్తె రొడ్డ హారిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. 5వ తరగతి నుంచి మహీంద్రాహిల్స్ హైదరాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తూనే వాలీబాల్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా చింతకుంటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాలీబాల్ అకాడమీలో చేరి, కోచ్ సతీష్ సారథ్యంలో రెండేళ్లపాటు కఠిన శిక్షణ పొందింది. ఆటలోని మెలకువలను ఒంటపట్టించుకుని ప్రతిభావంతమైన క్రీడాకారిణిగా ఎదిగింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న హారిక, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ప్రేమలత మార్గదర్శకత్వంలో మరింతగా రాటుదేలింది. కళాశాల తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధిగా రాష్ట్ర స్థాయి జట్టులో స్థానం దక్కించుకుంది.అట్టహాసంగా ప్రారంభమైన పోటీలుమహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రంగారెడ్డిగూడలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులు, గురువులు, పుట్టి పెరిగిన ఊరు, రాష్ట్రం మరియు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.జాతీయ జట్టు ఎంపికపై దృష్టిరాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నారు. బాలికల జట్టు అబ్జర్వర్ జక్కయ్య, బాలుర జట్టు అబ్జర్వర్ పర్వతాలు గౌడ్ ల పర్యవేక్షణలో నేడు ప్రతిభావంతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో తనదైన శైలిలో రాణిస్తున్న హారిక, జాతీయ జట్టుకు సైతం ఎంపికవుతుందనే నమ్మకాన్ని కోచ్‌లు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. హారిక సాధించిన ఈ విజయం పట్ల వెల్దేవి గ్రామస్థులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.