Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
ఎడిటోరియల్ ఆర్ఎన్ఆర్ అక్షర జ్వాల✍️ బ్రేకింగ్

దొర అరాచకాలను ఎదిరించి రోకలిబండతో గడగడలాడించిన పోరాట తొలి నిప్పురవ్వ: చిట్యాల ఐలమ్మ

ప్రతినిధి: Chief Editor
ప్రచురణ: 26 Sep 2026 05:11 AM
వీక్షణలు: 214 Views
దొర అరాచకాలను ఎదిరించి రోకలిబండతో గడగడలాడించిన పోరాట తొలి నిప్పురవ్వ: చిట్యాల ఐలమ్మ

»» విసునూరు దొర గూండాలను ఎదిరించి, కౌలు పంటను కాపాడుకున్న చారిత్రాత్మక ధీరవనిత

»» వెట్టిచాకిరీ, భూస్వామ్య దోపిడీపై బడుగు బలహీన వర్గాల స్వయం ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనం

»» ఆమె ధిక్కారమే సాయుధ పోరాటానికి నాంది, దొడ్డి కొమురయ్య అమరత్వానికి ప్రేరణ

»» తరతరాల బానిసత్వ సంకెళ్లను తెంచిన అణగారిన ప్రజల ఆత్మగౌరవ ప్రతీక

»» నేడు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి.. ఆ పోరాట స్ఫూర్తికి ఘన నివాళి!

 నిజాం సంస్థానంలో ఆనాడు దొరలు, దేశ్‌ముఖ్‌ల అధికారం ఎంతలా చెలాయించేవారంటే.. సామాన్య రైతులు, బడుగు, బలహీన వర్గాలు వారి గడీల ముందు చెప్పులు చేతబట్టుకుని, తలవంచి నడవాల్సిన దుస్థితి ఉండేది. చాకలి, మంగలి, మాదిగ, మాల వంటి వృత్తి కులాల వారు ఉచితంగా చాకిరి (వెట్టి) చేయాల్సి వచ్చేది. దొరల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా లేదా గడీకి ఏ అధికారి వచ్చినా ఉచితంగా శ్రమదానం చేయడమే కాకుండా, పొలాల్లో పండిన శ్రేష్ఠమైన పంటను “నజరానా”గా సమర్పించాల్సి వచ్చేది. ఈ దోపిడీని సహజ న్యాయంగా భావిస్తున్న కాలంలో, ఐలమ్మ ప్రశ్నించిన తీరు విప్లవాత్మకమైనది. “మేము చెమటోడ్చి పండించిన పంటను మీరెందుకు ఎత్తుకెళ్తారు? కౌలు చెల్లించిన తర్వాత మిగిలిన ధాన్యంపై మాకున్న హక్కేమిటి?” అని ఆమె సంధించిన ప్రశ్నలు కేవలం విసునూరు రామచంద్రారెడ్డి గడీనే కాకుండా, మొత్తం నిజాం నవాబు ఫ్యూడల్ పాలన పునాదులనే కదిలించాయి. నిస్సహాయంగా బతుకుతున్న గ్రామీణ పేదల్లో "మనం కూడా ఎదురుతిరిగి నిలబడగలం" అన్న అపారమైన ధైర్యాన్ని ఐలమ్మ ధిక్కారం నింపింది.
  ఐలమ్మ చేసిన పోరాటం వ్యక్తిగత ఆస్తి రక్షణతో మొదలైనా, అది త్వరలోనే విస్తృత రాజకీయ, సామాజిక పోరాటంగా రూపాంతరం చెందింది. దొరల ఆగడాలను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గుర్తించిన ఆమె, ఆనాడు తెలంగాణ గ్రామాల్లో ప్రజలను చైతన్యపరుస్తున్న ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలిపారు. పాలకుర్తి మరియు పరిసర గ్రామాలలోని పేద రైతులను, కూలీలను ఆమె ఉద్యమం వైపు నడిపించారు. నాటి ఉద్యమ నాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి వంటి ప్రముఖులకు ఆమె పోరాటం గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాయకులు పాలకుర్తి వచ్చినప్పుడు వారికి ఆశ్రయం కల్పించడం, రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. పంటను దక్కించుకోవడానికి దొరలు కోర్టుల్లో వేసిన అక్రమ కేసులను కొండాలక్ష్మణ్ బాపూజీ వంటి న్యాయవాదుల సహకారంతో న్యాయస్థానంలోనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పంట పోరాటంలో ఓడిపోయిన విసునూరు దొర ప్రతీకారంతో రగిలిపోయాడు. ఆమె ఇంటిని తగలబెట్టించారు, సామాన్లను లూటీ చేశారు. కుమారులను, భర్తను అక్రమ కేసులతో జైలుకు పంపి చిత్రహింసలకు గురిచేశారు. ఐలమ్మపై కూడా తీవ్రమైన పోలీసు నిర్బంధాలు, దాడులు కొనసాగాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, కుటుంబం ఛిన్నాభిన్నమైనా ఐలమ్మ ఏనాడూ తలవంచలేదు. "నా ప్రాణం పోయినా సరే, నా హక్కును వదులుకోను" అని నినదించి, ఉద్యమానికి అండగా నిలిచింది.
దొడ్డి కొమురయ్య అమరత్వం - రాజుకున్న సాయుధ సమరం

  ఐలమ్మ పంటను దొంగిలించడానికి విసునూరు దొర పంపిన గూండాలు, రజాకార్లు గ్రామంపై దాడులు తీవ్రతరం చేశారు. 1946 జూలై 4న దొరల గూండాలు సంఘం నాయకులపై, ఐలమ్మ ఇల్లు ఉన్న ప్రాంతంపై జరిపిన కాల్పుల్లోనే యువ కిశోరం దొడ్డి కొమురయ్య నేలకొరిగారు. కొమురయ్య అమరత్వం తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. చాకలి ఐలమ్మ మొదలుపెట్టిన పంట రక్షణ పోరాటం, దొడ్డి కొమురయ్య రక్తతర్పణంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారి దావానలంలా 3,000 గ్రామాలకు విస్తరించింది. లక్షలాది ఎకరాల భూమిని దొరల నుంచి విముక్తం చేసి పేదలకు పంచే మహత్తర విప్లవానికి ఐలమ్మ తొలి కార్యాచరణ వేదిక అయ్యారు. సాయుధ పోరాటం ముగిసిన తర్వాత కూడా ఐలమ్మ సామాజిక సేవ, ప్రజా ఉద్యమాల పట్ల నిబద్ధతతోనే జీవించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ నష్టాలు ఎదురైనప్పటికీ ఆమె ఏనాడూ తన సిద్ధాంతాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. 1985 సెప్టెంబర్ 10న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె విడిచివెళ్లిన వారసత్వం నేటి తరానికి ఎన్నో పాఠాలు నేర్పుతోంది. పురుషాధిక్య, భూస్వామ్య సమాజంలో ఒక మహిళ రోకలిబండ చేతబట్టి సైన్యాలను ఎదుర్కొన్న తీరు ప్రపంచ విప్లవ చరిత్రలోనే అరుదైన ఘట్టం. అన్యాయాన్ని సహించడమే బానిసత్వం అని, ఎదిరించి నిలబడటమే హక్కుల సాధనకు తొలిమెట్టు అని నిరూపించిన యోధురాలు ఆమె “దున్నేవాడిదే భూమి” అనే నినాదానికి ఆచరణాత్మక రూపం ఇచ్చిన ప్రజా నాయకురాలు ఐలమ్మ. తెలంగాణ సమాజం నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందంటే, నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వేలాది మంది అమరులతో పాటు, అణువణువునా ధైర్యాన్ని నింపుకుని పోరాడిన చాకలి ఐలమ్మ వంటి వీరనారుల త్యాగమే కారణం. ఆమె జయంతి సందర్భంగా ఆ వీరమాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమె పోరాట స్ఫూర్తిని తరతరాలకు అందించడం మనందరి బాధ్యత.

జోహార్ వీరనారి చిట్యాల ఐలమ్మ!
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!!

                     – ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 11-10-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

దొర అరాచకాలను ఎదిరించి రోకలిబండతో గడగడలాడించిన పోరాట తొలి నిప్పురవ్వ: చిట్యాల ఐలమ్మ

news image
హైదరాబాద్, Oct 11 (ప్రజాయుద్ధనౌక న్యూస్): »» విసునూరు దొర గూండాలను ఎదిరించి, కౌలు పంటను కాపాడుకున్న చారిత్రాత్మక ధీరవనిత»» వెట్టిచాకిరీ, భూస్వామ్య దోపిడీపై బడుగు బలహీన వర్గాల స్వయం ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనం»» ఆమె ధిక్కారమే సాయుధ పోరాటానికి నాంది, దొడ్డి కొమురయ్య అమరత్వానికి ప్రేరణ»» తరతరాల బానిసత్వ సంకెళ్లను తెంచిన అణగారిన ప్రజల ఆత్మగౌరవ ప్రతీక»» నేడు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి.. ఆ పోరాట స్ఫూర్తికి ఘన నివాళి! నిజాం సంస్థానంలో ఆనాడు దొరలు, దేశ్‌ముఖ్‌ల అధికారం ఎంతలా చెలాయించేవారంటే.. సామాన్య రైతులు, బడుగు, బలహీన వర్గాలు వారి గడీల ముందు చెప్పులు చేతబట్టుకుని, తలవంచి నడవాల్సిన దుస్థితి ఉండేది. చాకలి, మంగలి, మాదిగ, మాల వంటి వృత్తి కులాల వారు ఉచితంగా చాకిరి (వెట్టి) చేయాల్సి వచ్చేది. దొరల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా లేదా గడీకి ఏ అధికారి వచ్చినా ఉచితంగా శ్రమదానం చేయడమే కాకుండా, పొలాల్లో పండిన శ్రేష్ఠమైన పంటను “నజరానా”గా సమర్పించాల్సి వచ్చేది. ఈ దోపిడీని సహజ న్యాయంగా భావిస్తున్న కాలంలో, ఐలమ్మ ప్రశ్నించిన తీరు విప్లవాత్మకమైనది. “మేము చెమటోడ్చి పండించిన పంటను మీరెందుకు ఎత్తుకెళ్తారు? కౌలు చెల్లించిన తర్వాత మిగిలిన ధాన్యంపై మాకున్న హక్కేమిటి?” అని ఆమె సంధించిన ప్రశ్నలు కేవలం విసునూరు రామచంద్రారెడ్డి గడీనే కాకుండా, మొత్తం నిజాం నవాబు ఫ్యూడల్ పాలన పునాదులనే కదిలించాయి. నిస్సహాయంగా బతుకుతున్న గ్రామీణ పేదల్లో "మనం కూడా ఎదురుతిరిగి నిలబడగలం" అన్న అపారమైన ధైర్యాన్ని ఐలమ్మ ధిక్కారం నింపింది.  ఐలమ్మ చేసిన పోరాటం వ్యక్తిగత ఆస్తి రక్షణతో మొదలైనా, అది త్వరలోనే విస్తృత రాజకీయ, సామాజిక పోరాటంగా రూపాంతరం చెందింది. దొరల ఆగడాలను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గుర్తించిన ఆమె, ఆనాడు తెలంగాణ గ్రామాల్లో ప్రజలను చైతన్యపరుస్తున్న ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలిపారు. పాలకుర్తి మరియు పరిసర గ్రామాలలోని పేద రైతులను, కూలీలను ఆమె ఉద్యమం వైపు నడిపించారు. నాటి ఉద్యమ నాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి వంటి ప్రముఖులకు ఆమె పోరాటం గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాయకులు పాలకుర్తి వచ్చినప్పుడు వారికి ఆశ్రయం కల్పించడం, రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. పంటను దక్కించుకోవడానికి దొరలు కోర్టుల్లో వేసిన అక్రమ కేసులను కొండాలక్ష్మణ్ బాపూజీ వంటి న్యాయవాదుల సహకారంతో న్యాయస్థానంలోనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పంట పోరాటంలో ఓడిపోయిన విసునూరు దొర ప్రతీకారంతో రగిలిపోయాడు. ఆమె ఇంటిని తగలబెట్టించారు, సామాన్లను లూటీ చేశారు. కుమారులను, భర్తను అక్రమ కేసులతో జైలుకు పంపి చిత్రహింసలకు గురిచేశారు. ఐలమ్మపై కూడా తీవ్రమైన పోలీసు నిర్బంధాలు, దాడులు కొనసాగాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, కుటుంబం ఛిన్నాభిన్నమైనా ఐలమ్మ ఏనాడూ తలవంచలేదు. "నా ప్రాణం పోయినా సరే, నా హక్కును వదులుకోను" అని నినదించి, ఉద్యమానికి అండగా నిలిచింది.దొడ్డి కొమురయ్య అమరత్వం - రాజుకున్న సాయుధ సమరం  ఐలమ్మ పంటను దొంగిలించడానికి విసునూరు దొర పంపిన గూండాలు, రజాకార్లు గ్రామంపై దాడులు తీవ్రతరం చేశారు. 1946 జూలై 4న దొరల గూండాలు సంఘం నాయకులపై, ఐలమ్మ ఇల్లు ఉన్న ప్రాంతంపై జరిపిన కాల్పుల్లోనే యువ కిశోరం దొడ్డి కొమురయ్య నేలకొరిగారు. కొమురయ్య అమరత్వం తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. చాకలి ఐలమ్మ మొదలుపెట్టిన పంట రక్షణ పోరాటం, దొడ్డి కొమురయ్య రక్తతర్పణంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారి దావానలంలా 3,000 గ్రామాలకు విస్తరించింది. లక్షలాది ఎకరాల భూమిని దొరల నుంచి విముక్తం చేసి పేదలకు పంచే మహత్తర విప్లవానికి ఐలమ్మ తొలి కార్యాచరణ వేదిక అయ్యారు. సాయుధ పోరాటం ముగిసిన తర్వాత కూడా ఐలమ్మ సామాజిక సేవ, ప్రజా ఉద్యమాల పట్ల నిబద్ధతతోనే జీవించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ నష్టాలు ఎదురైనప్పటికీ ఆమె ఏనాడూ తన సిద్ధాంతాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. 1985 సెప్టెంబర్ 10న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె విడిచివెళ్లిన వారసత్వం నేటి తరానికి ఎన్నో పాఠాలు నేర్పుతోంది. పురుషాధిక్య, భూస్వామ్య సమాజంలో ఒక మహిళ రోకలిబండ చేతబట్టి సైన్యాలను ఎదుర్కొన్న తీరు ప్రపంచ విప్లవ చరిత్రలోనే అరుదైన ఘట్టం. అన్యాయాన్ని సహించడమే బానిసత్వం అని, ఎదిరించి నిలబడటమే హక్కుల సాధనకు తొలిమెట్టు అని నిరూపించిన యోధురాలు ఆమె “దున్నేవాడిదే భూమి” అనే నినాదానికి ఆచరణాత్మక రూపం ఇచ్చిన ప్రజా నాయకురాలు ఐలమ్మ. తెలంగాణ సమాజం నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందంటే, నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వేలాది మంది అమరులతో పాటు, అణువణువునా ధైర్యాన్ని నింపుకుని పోరాడిన చాకలి ఐలమ్మ వంటి వీరనారుల త్యాగమే కారణం. ఆమె జయంతి సందర్భంగా ఆ వీరమాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమె పోరాట స్ఫూర్తిని తరతరాలకు అందించడం మనందరి బాధ్యత. జోహార్ వీరనారి చిట్యాల ఐలమ్మ!అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!!                     – ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️