ఎడిటోరియల్
ఆర్ఎన్ఆర్ అక్షర జ్వాల✍️
బ్రేకింగ్
నా ఆశల దీపం.. నా అక్షర రూపం.! నా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాభినందనలు
కనుపాపవై నా లోగిలిలో అడుగుపెట్టిన నాడే
నా గుండెల్లో వెలిగింది ఓ మహోన్నత ఆశల దీపం
చదువే మనిషికి అసలైన వెలుగని నమ్మి
ముందుచూపుతో నిన్ను పిలుచుకున్నాను.. అక్షర!
అక్షరానికి నాశనం లేదు.. అది జ్ఞానానికి అమృత రూపం
పేరులోనే సంకల్పాన్ని నింపి నిన్ను పెంచిన వేళ
నా ప్రతి ఆలోచనకూ, నా ప్రతి ఆశయానికీ
నిలువెత్తు ప్రతిరూపమై నిలిచావు నా చిట్టితల్లీ!
గురుకుల ప్రాంగణమే ఒక తపస్సుగా.. క్రమశిక్షణే నీ శ్వాసగా
నిత్య సాధనతో అక్షరాలను అవపోసన పడుతూ
తరగతి గదిలో ప్రథమురాలివై ప్రకాశిస్తున్న నా చిట్టితల్లీ
కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్న నీ పట్టుదలే నీకు రక్ష!
అక్షరా.. చదువంటే కేవలం పరీక్షల పత్రం కాదు
అది సమాజాన్ని మార్చే ఒక దివ్యమైన ఆయుధం
ఉన్నత విద్యల శిఖరాలను అలవోకగా అధిరోహించి
జ్ఞాన సంపన్నురాలవై జగతిని మెప్పించాలి!
నీ చేతి చదువు పదిమంది కన్నీళ్లు తుడవాలి
నీ ఉన్నత స్థానం నిస్సహాయులకు అండగా నిలవాలి
సమాజ సేవలో నీ పేరు మార్మోగాలి
రొడ్డ ఇంట వెలిగిన వేగుచుక్కవై
ఈ లోకానికి నిండు వెలుగులు పంచాలి!
కలలు పెద్దవిగా కను.. సంకల్పం దృఢంగా ఉంచు
కష్టాలు ఎదురైనా నవ్వుతూ జయించు..
నా, నీ కలలన్నీ నిజమై, కాలం నీకు పూలబాటలు పరచాలనీ
ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో
నూరు వసంతాలు విరాజిల్లాలని
తండ్రిగా మనసారా నిన్ను దీవిస్తున్నాను తల్లి!
నా ఆశయాల ఆశల దీపం.. నా బంగారు తల్లి రొడ్డ అక్షరకు పుట్టినరోజు శుభాభినందనలు!
- ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️