Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
రాజకీయాలు బ్రేకింగ్

ఉమ్మడి నల్లగొండ రాజకీయ సింహం ‘టైగర్ దామన్న’

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 01 Oct 2026 08:08 AM
వీక్షణలు: 173 Views
ఉమ్మడి నల్లగొండ రాజకీయ సింహం ‘టైగర్ దామన్న’

★ ప్రజలే బలగం.. పోరాటమే ఊపిరి... రాంరెడ్డి దామోదర్‌రెడ్డిది అరుదైన ప్రస్థానం

★ ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎదురొడ్డి నిలిచిన యోధుడు

★ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన కాంగ్రెస్ ‘టైగర్’

★ ‘టైగర్’ వారసుడు.. తుంగతుర్తి ఆశాకిరణం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

★ వారసత్వానికి దక్కిన గుర్తింపు.. దామన్న తనయునికి ఎమ్మెల్సీ టికెట్ 

★ దామన్న తనయునికి ఎమ్మెల్సీ టికెట్ దక్కడంతో క్యాడర్లో రెట్టింపు ఉత్సాహం

ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయల్లో తనదైన ముద్ర వేసి, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ప్రజానేతగా నిలిచిన ధీరుడు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (టైగర్ దామన్న). ప్రజల పక్షాన గర్జించే స్వభావం, ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టిన రాజకీయ వ్యూహం ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గత సంవత్సరం కన్నుమూసిన దామన్న, సరిగ్గా సంవత్సరానికి ఆయన ప్రాతినిధ్యం వహించి రాజకీయంగా అగ్రస్థానానికి ఎదిగిన తుంగతుర్తి గడ్డపై నేడు ఆయన విగ్రహావిష్కరణ మహాసభ ఘనంగా జరుగుతోంది.

బాల్యం మరియు విద్యాభ్యాసం

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 14న దామోదర్‌రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను కామేపల్లిలోనే పూర్తి చేసిన ఆయన, హైస్కూల్ విద్యను హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక వివేకవర్ధిని పాఠశాలలో అభ్యసించారు. అనంతరం వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ (బీజెడ్సీ) పూర్తి చేశారు. తుంగతుర్తికి చెందిన వరూధినీదేవిని వివాహం చేసుకొని, అక్కడే స్థిరపడి ప్రజాసేవను జీవన విధానంగా మార్చుకున్నారు. ఆయన సోదరుడు దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలందించిన విషయం విదితమే.

కమ్యూనిస్టుల కంచుకోటలో ఎగరేసిన మూడు కాంగ్రెస్ జెండా

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు వామపక్ష ఉద్యమాలకు, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి అగ్రశ్రేణి వామపక్ష యోధులు గెలిచిన తుంగతుర్తి నియోజకవర్గంలో 1985లో దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసి సంచలనం సృష్టించారు.

1985లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా దామన్న చరిత్రకెక్కారు.
1989లో జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఆయన ఒకరిగా నిలిచారు.
1994లో స్వతంత్ర పోరాటం: కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినప్పుడు వెనకడుగు వేయకుండా, ప్రజా కాంగ్రెస్ (ఇండిపెండెంట్) అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేసి తన ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు.
2004లో తుంగతుర్తి నుంచి నాలుగోసారి విజయదుందుభి మోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.

మంత్రిగా అభివృద్ధి ముద్ర

దామోదర్‌రెడ్డి కేవలం ప్రజాప్రతినిధిగానే కాకుండా, పరిపాలనా దక్షుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1992లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి పాలనలో తనదైన ముద్ర వేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో కీలకమైన ఐటీ (సమాచార సాంకేతిక) శాఖ మంత్రిగా సేవలందించారు.

 రాష్ట్రంలో వైఎస్సార్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ సభలు, సదస్సులు నిర్వహించి క్యాడర్‌లో ఉత్సాహం నింపిన క్రమంలో ఆయన ‘టైగర్ దామన్న’గా సుపరిచితులయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, 2014, 2018, 2023 ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ స్వల్ప తేడాతోనే ఓటమి పాలై, తుదివరకు ప్రజాక్షేత్రంలోనే నిలిచారు.

తండ్రికి తగ్గ తనయుడు: ఎమ్మెల్సీ బరిలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

దామన్న ప్రథమ వర్ధంతి విగ్రహావిష్కరణ సభ వేళ కాంగ్రెస్ శ్రేణుల్లో, దామన్న అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దామోదర్‌రెడ్డి తనయుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.  తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే సర్వోత్తమ్ రెడ్డి, దామన్న వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. దామన్నను ప్రాణంగా భావించిన కేడర్‌ను, అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి దామన్నకు ఘనమైన నివాళి అర్పిస్తారని నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తుంగతుర్తి గడ్డపై ఆవిష్కృతమవుతున్న దామన్న విగ్రహం... ఆయన చేసిన సేవలను, రాజీలేని పోరాట పటిమను భావితరాలకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుంది.

                - ఆర్.ఎన్..ఆర్. అక్షర జ్వాల✍️

https://youtu.be/D8U7fR_AL2s?si=MwuTPLBeQtxyV6Hh

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 11-10-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ఉమ్మడి నల్లగొండ రాజకీయ సింహం ‘టైగర్ దామన్న’

news image
హైదరాబాద్, Oct 11 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ★ ప్రజలే బలగం.. పోరాటమే ఊపిరి... రాంరెడ్డి దామోదర్‌రెడ్డిది అరుదైన ప్రస్థానం★ ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎదురొడ్డి నిలిచిన యోధుడు★ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన కాంగ్రెస్ ‘టైగర్’★ ‘టైగర్’ వారసుడు.. తుంగతుర్తి ఆశాకిరణం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి★ వారసత్వానికి దక్కిన గుర్తింపు.. దామన్న తనయునికి ఎమ్మెల్సీ టికెట్ ★ దామన్న తనయునికి ఎమ్మెల్సీ టికెట్ దక్కడంతో క్యాడర్లో రెట్టింపు ఉత్సాహంప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయల్లో తనదైన ముద్ర వేసి, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ప్రజానేతగా నిలిచిన ధీరుడు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (టైగర్ దామన్న). ప్రజల పక్షాన గర్జించే స్వభావం, ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టిన రాజకీయ వ్యూహం ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గత సంవత్సరం కన్నుమూసిన దామన్న, సరిగ్గా సంవత్సరానికి ఆయన ప్రాతినిధ్యం వహించి రాజకీయంగా అగ్రస్థానానికి ఎదిగిన తుంగతుర్తి గడ్డపై నేడు ఆయన విగ్రహావిష్కరణ మహాసభ ఘనంగా జరుగుతోంది.బాల్యం మరియు విద్యాభ్యాసంఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 14న దామోదర్‌రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను కామేపల్లిలోనే పూర్తి చేసిన ఆయన, హైస్కూల్ విద్యను హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక వివేకవర్ధిని పాఠశాలలో అభ్యసించారు. అనంతరం వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ (బీజెడ్సీ) పూర్తి చేశారు. తుంగతుర్తికి చెందిన వరూధినీదేవిని వివాహం చేసుకొని, అక్కడే స్థిరపడి ప్రజాసేవను జీవన విధానంగా మార్చుకున్నారు. ఆయన సోదరుడు దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలందించిన విషయం విదితమే.కమ్యూనిస్టుల కంచుకోటలో ఎగరేసిన మూడు కాంగ్రెస్ జెండాఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు వామపక్ష ఉద్యమాలకు, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి అగ్రశ్రేణి వామపక్ష యోధులు గెలిచిన తుంగతుర్తి నియోజకవర్గంలో 1985లో దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసి సంచలనం సృష్టించారు.1985లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా దామన్న చరిత్రకెక్కారు.1989లో జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఆయన ఒకరిగా నిలిచారు.1994లో స్వతంత్ర పోరాటం: కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినప్పుడు వెనకడుగు వేయకుండా, ప్రజా కాంగ్రెస్ (ఇండిపెండెంట్) అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేసి తన ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు.2004లో తుంగతుర్తి నుంచి నాలుగోసారి విజయదుందుభి మోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.మంత్రిగా అభివృద్ధి ముద్రదామోదర్‌రెడ్డి కేవలం ప్రజాప్రతినిధిగానే కాకుండా, పరిపాలనా దక్షుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1992లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి పాలనలో తనదైన ముద్ర వేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో కీలకమైన ఐటీ (సమాచార సాంకేతిక) శాఖ మంత్రిగా సేవలందించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ సభలు, సదస్సులు నిర్వహించి క్యాడర్‌లో ఉత్సాహం నింపిన క్రమంలో ఆయన ‘టైగర్ దామన్న’గా సుపరిచితులయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, 2014, 2018, 2023 ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ స్వల్ప తేడాతోనే ఓటమి పాలై, తుదివరకు ప్రజాక్షేత్రంలోనే నిలిచారు.తండ్రికి తగ్గ తనయుడు: ఎమ్మెల్సీ బరిలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిదామన్న ప్రథమ వర్ధంతి విగ్రహావిష్కరణ సభ వేళ కాంగ్రెస్ శ్రేణుల్లో, దామన్న అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దామోదర్‌రెడ్డి తనయుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.  తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే సర్వోత్తమ్ రెడ్డి, దామన్న వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. దామన్నను ప్రాణంగా భావించిన కేడర్‌ను, అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి దామన్నకు ఘనమైన నివాళి అర్పిస్తారని నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.తుంగతుర్తి గడ్డపై ఆవిష్కృతమవుతున్న దామన్న విగ్రహం... ఆయన చేసిన సేవలను, రాజీలేని పోరాట పటిమను భావితరాలకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుంది.                - ఆర్.ఎన్..ఆర్. అక్షర జ్వాల✍️https://youtu.be/D8U7fR_AL2s?si=MwuTPLBeQtxyV6Hh