Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
జాతీయం బ్రేకింగ్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే: రాహుల్ గాంధీ

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 25 Jul 2026 03:17 PM
వీక్షణలు: 19 Views
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే: రాహుల్ గాంధీ

ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ పరిణామం ఎవరికీ ఓటమి కాదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం దక్కిన విజయమని ఆయన అభివర్ణించారు. విద్యారంగంలో సంస్కరణలు, పారదర్శకత మరియు బాధ్యతాయుత వైఖరి కోసం విద్యార్థులు పట్టుబట్టి ఈ విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ​ఒకప్పుడు భారత విద్యారంగం అందరికీ గర్వకారణంగా ఉండేదని, కానీ గడిచిన కొన్ని ఏళ్లలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యవస్థలోని లోపాలకు కేవలం ఒక చిహ్నం మాత్రమేనని, విద్యార్థులు ఏ ఒక్క మంత్రిని టార్గెట్ చేస్తూ ఆందోళన చేయలేదని ఆయన వివరించారు. వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత ధోరణి కోసమే విద్యార్థులు నిరసనకు దిగారని తెలిపారు. నిరసనల సమయంలో విద్యార్థులపై కఠినంగా వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, విద్యార్థులకు ప్రధాని కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాహుల్ గాంధీ, నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు అమిత్ షానే కారణమని ఆరోపించారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 21-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే: రాహుల్ గాంధీ

news image
హైదరాబాద్, Sep 21 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ పరిణామం ఎవరికీ ఓటమి కాదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం దక్కిన విజయమని ఆయన అభివర్ణించారు. విద్యారంగంలో సంస్కరణలు, పారదర్శకత మరియు బాధ్యతాయుత వైఖరి కోసం విద్యార్థులు పట్టుబట్టి ఈ విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ​ఒకప్పుడు భారత విద్యారంగం అందరికీ గర్వకారణంగా ఉండేదని, కానీ గడిచిన కొన్ని ఏళ్లలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యవస్థలోని లోపాలకు కేవలం ఒక చిహ్నం మాత్రమేనని, విద్యార్థులు ఏ ఒక్క మంత్రిని టార్గెట్ చేస్తూ ఆందోళన చేయలేదని ఆయన వివరించారు. వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత ధోరణి కోసమే విద్యార్థులు నిరసనకు దిగారని తెలిపారు. నిరసనల సమయంలో విద్యార్థులపై కఠినంగా వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, విద్యార్థులకు ప్రధాని కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాహుల్ గాంధీ, నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు అమిత్ షానే కారణమని ఆరోపించారు.