Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

కళాకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. సోమన్నను చట్టసభలకు పంపిస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 14 Aug 2026 05:50 PM
వీక్షణలు: 95 Views
కళాకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. సోమన్నను చట్టసభలకు పంపిస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (రవీంద్రభారతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పదునైన గళంతో, గజ్జె కట్టిన పాదాలతో పల్లెపల్లెనా ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు డాక్టర్ ఏపూరి సోమన్న సాంస్కృతిక, సామాజిక పోరాటాల సమాహారంగా వెలువడిన ‘25 ఏండ్ల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభ గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో అత్యంత వైభవంగా, భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులపై విరుచుకుపడ్డారు.

కన్నీటి పర్యంతమైన ప్రజా గాయకుడు.. అక్కున చేర్చుకున్న ఎమ్మెల్యే

పుస్తకావిష్కరణ అనంతరం రచయిత, ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న ప్రసంగిస్తూ.. పాతికేళ్లుగా ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తి పాడాననీ, ధూం ధాం వేదికల నుంచి సకల జనుల సమ్మె దాకా నా గళాన్ని ప్రజల కోసం అంకితం చేశానన్నారు. కానీ రాజకీయ పార్టీలు నా పాటలను, నా కలాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకున్నాయనీ తీరా సమయం వచ్చాక నన్ను నట్టేట ముంచి అనగదొక్కారని, కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు, రాజకీయ ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలిపోయిందని తీవ్ర భావోద్వేగానికి గురై వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. సోమన్న ఆవేదనను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే వేదికపై లేచివెళ్లి, ఆయన కన్నీళ్లను తుడిచి ఆత్మీయంగా హత్తుకున్నారు. "కళాకారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. ఇచ్చిన మాట ప్రాణం పోయినా తప్పే వ్యక్తిని కాననీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏపూరి సోమన్న అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు అని సోమన్నను చట్టసభలకు పంపించే పూర్తి బాధ్యతను నేను భుజాన వేసుకుంటున్నాను అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమన్నకు, ప్రజలకు పూర్తి బరోసా కల్పించారు. వెంటనే సభకు హాజరైన ప్రజలు, ప్రముఖులు లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడంతో సభ దద్దరిల్లింది.

సాంస్కృతిక వేడుక – గుస్సాడి నృత్యం

కార్యక్రమ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోయగోండు ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ ‘గుస్సాడి’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీల డప్పు వాయిద్యాలు, నెమలి పింఛాల తలపాగాలతో సాగిన విన్యాసాలు రవీంద్రభారతికి విచ్చేసిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఉద్యమకారులకు న్యాయం దక్కలే.. మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం రాజ్యమేలుతోంది: కోమటిరెడ్డి ధ్వజం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని ప్రస్తుత పాలన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన, ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో నేటి పాలకులు ఆశయాలను తుంగలో తొక్కారనీ, తెలంగాణలో మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం రాజ్యమేలుతోందని, అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తన సహాయంతో రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు నాయకులు, నేడు తనకే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడటం దారుణమని మండిపడ్డారు. తన చేయి ఎప్పుడూ నలుగురికీ ఇచ్చేదే తప్ప, మోసం చేసే చేయి కాదని స్పష్టం చేశారు. ఏపూరి సోమన్న పాట, పోరాట పటిమను చూస్తుంటే ప్రజాయుద్ధనౌక దివంగత గద్దర్ అన్న గుర్తుకొస్తున్నారని, ఉద్యమకారుల త్యాగాలను ఎవరూ విస్మరించలేరని కొనియాడారు.

 మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ "సోమన్న.. కంటనీరు పెట్టొద్దు, కన్నెర్ర చేయాలి! కళాకారుల వాటా, బహుజనుల హక్కుల కోసం పిడికిలెత్తి కొట్లాడాలి. ఆ పోరాట స్ఫూర్తితోనే చట్టసభల సీట్లు సాధించుకోవాలి. ఆ కోటాలో నీవు ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి. తెలంగాణ ఆడబిడ్డగా నా సంపూర్ణ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి." అని సోమన్నను ఆశీర్వదించారు. 

 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను, పాలకుల తప్పులను సూటిగా నిలదీసే ధైర్యం సోమన్న సొంతం. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పదునైన శబ్దాలు, లక్షలాది మంది ప్రజలను ఆలోచింపజేసే సామాజిక చైతన్యం ఒక్క ఏపూరి సోమన్న పాటలకే ఉన్నాయి. 25 ఏళ్ల ఆయన ప్రస్థానం ఒక ఉద్యమ చరిత్ర అని కొనియాడారు.

సోమన్న పాటలతో దద్దరిల్లిన రవీంద్రభారతి

 సభ మధ్యలో "ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ... మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఎటు పాయె?" అంటూ సాగిన సోమన్న విప్లవ, ఉద్యమ గీతాలు సభికుల్లో తీవ్ర ఉద్వేగాన్ని రేకెత్తించాయి. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ ధూంధాం వేదికల ద్వారా, సకల జనుల సమ్మె ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని వక్తలు కొనియాడారు. అనంతరం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సోమన్న విజయవంతంగా చేపట్టిన ‘జ్ఞాన చైతన్య యాత్ర’ ప్రజల ఆలోచనా విధానంలో తీసుకొచ్చిన గుణాత్మక మార్పులను ప్రముఖులు సభలో ప్రత్యేకంగా గుర్తుచేశారు. రాచకొండ రమేష్ ఏపూరి సోమన్నపైన రచించి పాడిన కవిత్వం సబీకులను ఆలోచింపచేసి ఆకట్టుకున్నది. వరంగల్ రవి పాడిన ‘అమ్మ’ పాట అమ్మ గొప్పతనాన్ని, ఆమె చూపించే నిస్వార్థమైన ప్రేమను, పడే కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన తనదైన శైలిలో గానం చేయడంతో ప్రాంగణమంతా నిశ్శబ్దం ఆవరించింది. రవి గళం నుంచి వెలువడిన భావగర్భితమైన పదాలు ప్రజలను ఆలోచింపచేశాయి.

ప్రజాస్వామిక చర్చా వేదికగా సభ

ఈ పుస్తకావిష్కరణ సభ కేవలం ఒక సాహిత్య లేదా సాంస్కృతిక కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ వర్తమాన సామాజిక, రాజకీయ పరిణామాలపై గళమెత్తే ఒక ప్రజాస్వామిక వేదికగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు, బహుజన మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

కళాకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. సోమన్నను చట్టసభలకు పంపిస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

news image
హైదరాబాద్ , Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (రవీంద్రభారతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పదునైన గళంతో, గజ్జె కట్టిన పాదాలతో పల్లెపల్లెనా ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు డాక్టర్ ఏపూరి సోమన్న సాంస్కృతిక, సామాజిక పోరాటాల సమాహారంగా వెలువడిన ‘25 ఏండ్ల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభ గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో అత్యంత వైభవంగా, భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులపై విరుచుకుపడ్డారు.కన్నీటి పర్యంతమైన ప్రజా గాయకుడు.. అక్కున చేర్చుకున్న ఎమ్మెల్యేపుస్తకావిష్కరణ అనంతరం రచయిత, ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న ప్రసంగిస్తూ.. పాతికేళ్లుగా ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తి పాడాననీ, ధూం ధాం వేదికల నుంచి సకల జనుల సమ్మె దాకా నా గళాన్ని ప్రజల కోసం అంకితం చేశానన్నారు. కానీ రాజకీయ పార్టీలు నా పాటలను, నా కలాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకున్నాయనీ తీరా సమయం వచ్చాక నన్ను నట్టేట ముంచి అనగదొక్కారని, కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు, రాజకీయ ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలిపోయిందని తీవ్ర భావోద్వేగానికి గురై వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. సోమన్న ఆవేదనను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే వేదికపై లేచివెళ్లి, ఆయన కన్నీళ్లను తుడిచి ఆత్మీయంగా హత్తుకున్నారు. "కళాకారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. ఇచ్చిన మాట ప్రాణం పోయినా తప్పే వ్యక్తిని కాననీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏపూరి సోమన్న అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు అని సోమన్నను చట్టసభలకు పంపించే పూర్తి బాధ్యతను నేను భుజాన వేసుకుంటున్నాను అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమన్నకు, ప్రజలకు పూర్తి బరోసా కల్పించారు. వెంటనే సభకు హాజరైన ప్రజలు, ప్రముఖులు లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడంతో సభ దద్దరిల్లింది.సాంస్కృతిక వేడుక – గుస్సాడి నృత్యంకార్యక్రమ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోయగోండు ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ ‘గుస్సాడి’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీల డప్పు వాయిద్యాలు, నెమలి పింఛాల తలపాగాలతో సాగిన విన్యాసాలు రవీంద్రభారతికి విచ్చేసిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఉద్యమకారులకు న్యాయం దక్కలే.. మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం రాజ్యమేలుతోంది: కోమటిరెడ్డి ధ్వజంమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని ప్రస్తుత పాలన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన, ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో నేటి పాలకులు ఆశయాలను తుంగలో తొక్కారనీ, తెలంగాణలో మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం రాజ్యమేలుతోందని, అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తన సహాయంతో రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు నాయకులు, నేడు తనకే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడటం దారుణమని మండిపడ్డారు. తన చేయి ఎప్పుడూ నలుగురికీ ఇచ్చేదే తప్ప, మోసం చేసే చేయి కాదని స్పష్టం చేశారు. ఏపూరి సోమన్న పాట, పోరాట పటిమను చూస్తుంటే ప్రజాయుద్ధనౌక దివంగత గద్దర్ అన్న గుర్తుకొస్తున్నారని, ఉద్యమకారుల త్యాగాలను ఎవరూ విస్మరించలేరని కొనియాడారు. మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ "సోమన్న.. కంటనీరు పెట్టొద్దు, కన్నెర్ర చేయాలి! కళాకారుల వాటా, బహుజనుల హక్కుల కోసం పిడికిలెత్తి కొట్లాడాలి. ఆ పోరాట స్ఫూర్తితోనే చట్టసభల సీట్లు సాధించుకోవాలి. ఆ కోటాలో నీవు ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి. తెలంగాణ ఆడబిడ్డగా నా సంపూర్ణ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి." అని సోమన్నను ఆశీర్వదించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను, పాలకుల తప్పులను సూటిగా నిలదీసే ధైర్యం సోమన్న సొంతం. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పదునైన శబ్దాలు, లక్షలాది మంది ప్రజలను ఆలోచింపజేసే సామాజిక చైతన్యం ఒక్క ఏపూరి సోమన్న పాటలకే ఉన్నాయి. 25 ఏళ్ల ఆయన ప్రస్థానం ఒక ఉద్యమ చరిత్ర అని కొనియాడారు.సోమన్న పాటలతో దద్దరిల్లిన రవీంద్రభారతి సభ మధ్యలో "ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ... మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఎటు పాయె?" అంటూ సాగిన సోమన్న విప్లవ, ఉద్యమ గీతాలు సభికుల్లో తీవ్ర ఉద్వేగాన్ని రేకెత్తించాయి. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ ధూంధాం వేదికల ద్వారా, సకల జనుల సమ్మె ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని వక్తలు కొనియాడారు. అనంతరం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సోమన్న విజయవంతంగా చేపట్టిన ‘జ్ఞాన చైతన్య యాత్ర’ ప్రజల ఆలోచనా విధానంలో తీసుకొచ్చిన గుణాత్మక మార్పులను ప్రముఖులు సభలో ప్రత్యేకంగా గుర్తుచేశారు. రాచకొండ రమేష్ ఏపూరి సోమన్నపైన రచించి పాడిన కవిత్వం సబీకులను ఆలోచింపచేసి ఆకట్టుకున్నది. వరంగల్ రవి పాడిన ‘అమ్మ’ పాట అమ్మ గొప్పతనాన్ని, ఆమె చూపించే నిస్వార్థమైన ప్రేమను, పడే కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన తనదైన శైలిలో గానం చేయడంతో ప్రాంగణమంతా నిశ్శబ్దం ఆవరించింది. రవి గళం నుంచి వెలువడిన భావగర్భితమైన పదాలు ప్రజలను ఆలోచింపచేశాయి.ప్రజాస్వామిక చర్చా వేదికగా సభఈ పుస్తకావిష్కరణ సభ కేవలం ఒక సాహిత్య లేదా సాంస్కృతిక కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ వర్తమాన సామాజిక, రాజకీయ పరిణామాలపై గళమెత్తే ఒక ప్రజాస్వామిక వేదికగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు, బహుజన మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.