తెలంగాణ
రమావత్ బిచ్య నాయక్ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): దేవరకొండ మండలం పెద్ద తండా నివాసి రమావత్ బిచ్య నాయక్ మృతి చెందడం ఎంతో బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పెద్ద తండాకు చేరుకున్న రవీంద్ర కుమార్, బిచ్య నాయక్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బిచ్య నాయక్ మరణం తుదివరకు మరువలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని వేడుకున్నానన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామావత్ నర్సింహ, శేరిపల్లి సర్పంచ్ రమావత్ బలరాం, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.