Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ప్రతినిధి: నల్గొండ
ప్రచురణ: 12 Aug 2026 04:32 AM
వీక్షణలు: 23 Views
దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
  • ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • నల్లగొండ డీటీడీఓ పి. కమలాకర్ రెడ్డి

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) లో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది ఆదివాసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ఆదివాసీలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారి సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆదివాసీ సమాజం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆచారాలు, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీటీడీఓ) పి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు. ఆదివాసీల విశిష్టమైన సంస్కృతిపై నేటి యువతలో మరింత అవగాహన పెంపొందించాలని, వారి హక్కులు, ఆత్మగౌరవం, సర్వాంగీణ వికాసం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఏటీడీఓ ఎం. శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) ఎ. కవిత, హెచ్‌డబ్ల్యూఓ ఈ. శేఖర్ రెడ్డిలతో పాటు పలువురు ట్రైబల్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఎంలు, హెచ్‌డబ్ల్యూఓలు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
నల్గొండ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

news image
నల్గొండ, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నల్లగొండ డీటీడీఓ పి. కమలాకర్ రెడ్డి ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) లో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది ఆదివాసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ఆదివాసీలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారి సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆదివాసీ సమాజం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆచారాలు, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీటీడీఓ) పి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు. ఆదివాసీల విశిష్టమైన సంస్కృతిపై నేటి యువతలో మరింత అవగాహన పెంపొందించాలని, వారి హక్కులు, ఆత్మగౌరవం, సర్వాంగీణ వికాసం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఏటీడీఓ ఎం. శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) ఎ. కవిత, హెచ్‌డబ్ల్యూఓ ఈ. శేఖర్ రెడ్డిలతో పాటు పలువురు ట్రైబల్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఎంలు, హెచ్‌డబ్ల్యూఓలు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.