Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి హనుమంతరావు: రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేత

ప్రతినిధి: మెదక్
ప్రచురణ: 12 Aug 2026 12:37 AM
వీక్షణలు: 124 Views
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి హనుమంతరావు: రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేత
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మెదక్/ పాపన్నపేట): మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సోదరుడైన ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు మంగళవారం వారి నివాసానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిస్తూ రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం దివంగత ఆకుల కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తో పాటు ఇతర స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
మెదక్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి హనుమంతరావు: రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేత

news image
మెదక్, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మెదక్/ పాపన్నపేట): మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సోదరుడైన ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు మంగళవారం వారి నివాసానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిస్తూ రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం దివంగత ఆకుల కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తో పాటు ఇతర స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.