Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

రైతన్న ఇంట సంతోషం కోసమే మహా వరుణయాగం: ఎమ్మెల్యే బాలు నాయక్

ప్రతినిధి: నల్గొండ
ప్రచురణ: 11 Aug 2026 05:26 AM
వీక్షణలు: 63 Views
రైతన్న ఇంట సంతోషం కోసమే మహా వరుణయాగం: ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ): రాష్ట్రంలో పసిడి పంటలు పండాలి.. రైతన్న ఇంట సంతోషం వెల్లివిరియాలి అన్న తపనతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మహావరుణ యాగం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ తీరాన వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా సంపూర్ణమైంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం ఆధ్వర్యంలో జరిగిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువులో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ యాగ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలు నాయక్.. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ వర్షాలపై నెలకొన్న ఆందోళనలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధ్యాత్మిక విధానంతో పాటు శాస్త్రీయ దృక్పథంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా అందడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
నల్గొండ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

రైతన్న ఇంట సంతోషం కోసమే మహా వరుణయాగం: ఎమ్మెల్యే బాలు నాయక్

news image
నల్గొండ, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ): రాష్ట్రంలో పసిడి పంటలు పండాలి.. రైతన్న ఇంట సంతోషం వెల్లివిరియాలి అన్న తపనతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మహావరుణ యాగం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ తీరాన వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా సంపూర్ణమైంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం ఆధ్వర్యంలో జరిగిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువులో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ యాగ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలు నాయక్.. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ వర్షాలపై నెలకొన్న ఆందోళనలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధ్యాత్మిక విధానంతో పాటు శాస్త్రీయ దృక్పథంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా అందడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.