Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ

సమాజానికి వెన్నెముక రైతు: ఎంఎన్ స్కూల్ లో ఆకట్టుకున్న ప్రదర్శన

ప్రతినిధి: నల్గొండ
ప్రచురణ: 10 Aug 2026 03:33 AM
వీక్షణలు: 73 Views
సమాజానికి వెన్నెముక రైతు: ఎంఎన్ స్కూల్ లో ఆకట్టుకున్న ప్రదర్శన
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): దేవరకొండ పట్టణంలోని ఎంఎన్ స్కూల్‌ (MN SCHOOL’S) లో రైతుల కష్టాలు, వ్యవసాయ రంగం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్నిశుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట నష్టాలు, కుటుంబ పోషణకు వారు పడుతున్న అవస్థలను 5, 6వ తరగతి విద్యార్థులు నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. ఈ సందర్భంగా ఎంఎన్ విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ పొలోజు నరేష్ చారి మాట్లాడుతూ రైతు శ్రమ ఫలితంగానే మనకు అన్నం దొరుకుతుందని, విద్యార్థులు రైతుల కష్టాన్ని గుర్తించి ఆహారాన్ని వృథా చేయకూడదని సూచించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులలో సామాజిక బాధ్యత, మానవతా విలువలు పెంపొందించేందుకు ప్రతి వారం ఇలాంటి ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన విద్యార్థులను, కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, యాజమాన్యాన్ని, పాఠశాల సిబ్బందిని   స్థానికులు, విద్యారుల తల్లిదండ్రులు అభినందించారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
నల్గొండ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

సమాజానికి వెన్నెముక రైతు: ఎంఎన్ స్కూల్ లో ఆకట్టుకున్న ప్రదర్శన

news image
నల్గొండ, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): దేవరకొండ పట్టణంలోని ఎంఎన్ స్కూల్‌ (MN SCHOOL’S) లో రైతుల కష్టాలు, వ్యవసాయ రంగం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్నిశుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట నష్టాలు, కుటుంబ పోషణకు వారు పడుతున్న అవస్థలను 5, 6వ తరగతి విద్యార్థులు నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. ఈ సందర్భంగా ఎంఎన్ విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ పొలోజు నరేష్ చారి మాట్లాడుతూ రైతు శ్రమ ఫలితంగానే మనకు అన్నం దొరుకుతుందని, విద్యార్థులు రైతుల కష్టాన్ని గుర్తించి ఆహారాన్ని వృథా చేయకూడదని సూచించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులలో సామాజిక బాధ్యత, మానవతా విలువలు పెంపొందించేందుకు ప్రతి వారం ఇలాంటి ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన విద్యార్థులను, కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, యాజమాన్యాన్ని, పాఠశాల సిబ్బందిని   స్థానికులు, విద్యారుల తల్లిదండ్రులు అభినందించారు.