Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ

సతీష్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రతినిధి: నల్గొండ
ప్రచురణ: 10 Aug 2026 03:18 AM
వీక్షణలు: 50 Views
సతీష్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): నేరడుగొమ్ము మండలం పడమటి తండాకు చెందిన నేనావత్ సతీష్ అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పడమటి తండాలో సతీష్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో సతీష్ కుటుంబానికి నిరంతరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. సతీష్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, పల్స వెంకటయ్య, కుంటిగోర్ల నాగరాజు, మంగ్య నాయక్ తదితర నాయకులు ఉన్నారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
నల్గొండ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

సతీష్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి

news image
నల్గొండ, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): నేరడుగొమ్ము మండలం పడమటి తండాకు చెందిన నేనావత్ సతీష్ అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పడమటి తండాలో సతీష్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో సతీష్ కుటుంబానికి నిరంతరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. సతీష్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, పల్స వెంకటయ్య, కుంటిగోర్ల నాగరాజు, మంగ్య నాయక్ తదితర నాయకులు ఉన్నారు.