Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగరం పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 03 Aug 2026 12:12 PM
వీక్షణలు: 25 Views
హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగరం పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): హైదరాబాద్ లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగరం పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని, ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రసుతం బయట ఉన్నవారు వర్షం తీవ్రరూపం దాల్చకముందే తమ పనులను త్వరితగతిన ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ముఖ్యంగా జలమయమైన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సత్వర సహాయం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసు, మున్సిపల్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సీపీ వెల్లడించారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగరం పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

news image
హైదరాబాద్ , Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): హైదరాబాద్ లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగరం పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని, ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రసుతం బయట ఉన్నవారు వర్షం తీవ్రరూపం దాల్చకముందే తమ పనులను త్వరితగతిన ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ముఖ్యంగా జలమయమైన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సత్వర సహాయం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసు, మున్సిపల్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సీపీ వెల్లడించారు.