Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 03 Aug 2026 11:24 AM
వీక్షణలు: 38 Views
ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్):  సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకుని భువనగిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి మరియు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

news image
హైదరాబాద్ , Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్):  సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకుని భువనగిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి మరియు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.