Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ

జహంగీర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్

ప్రతినిధి: యాదాద్రి భువనగిరి
ప్రచురణ: 31 Jul 2026 01:47 AM
వీక్షణలు: 76 Views
జహంగీర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్

»» మృతుని చిత్రపటానికి నివాళులర్పించిన వైస్ చైర్మన్ వెంకన్న గుప్తా 

»» బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా

యాదాద్రి భువనగిరి (మోత్కూరు జూలై 30): అకాల మరణం చెందిన నిరుపేద కుటుంబానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా అండగా నిలిచారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజారుకు చెందిన ఆరె జహంగీర్ ఇటీవల హఠాన్మరణం చెందగా, గురువారం ఆయన నివాసానికి వెళ్లిన వైస్ చైర్మన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జహంగీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జహంగీర్ చిన్న వయస్సులోనే మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి కుటుంబ అత్యవసర అవసరాల నిమిత్తం తనవంతుగా రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేసి అధైర్యపడవద్దని, కుటుంబానికి ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లేపల్లి శ్రావణ్, ఇక్కిరి నాగరాజు, బోయిని యాకు, ప్రవీణ్, సోమిరెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.


ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
యాదాద్రి భువనగిరి ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

జహంగీర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్

news image
మోత్కూరు, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): »» మృతుని చిత్రపటానికి నివాళులర్పించిన వైస్ చైర్మన్ వెంకన్న గుప్తా »» బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసాయాదాద్రి భువనగిరి (మోత్కూరు జూలై 30): అకాల మరణం చెందిన నిరుపేద కుటుంబానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా అండగా నిలిచారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజారుకు చెందిన ఆరె జహంగీర్ ఇటీవల హఠాన్మరణం చెందగా, గురువారం ఆయన నివాసానికి వెళ్లిన వైస్ చైర్మన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జహంగీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జహంగీర్ చిన్న వయస్సులోనే మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి కుటుంబ అత్యవసర అవసరాల నిమిత్తం తనవంతుగా రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేసి అధైర్యపడవద్దని, కుటుంబానికి ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లేపల్లి శ్రావణ్, ఇక్కిరి నాగరాజు, బోయిని యాకు, ప్రవీణ్, సోమిరెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.