విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
»» పట్టుదలతో చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి
»» బిసి హాస్టల్ విద్యార్థినులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్ లు శ్రీవిద్య, శైలజ
యాదాద్రి భువనగిరి, (మోత్కూరు జూలై 30): ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఆసరాగా చేసుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్లు గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య తెలిపారు. గురువారం స్థానిక బిసి బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు బెడ్ షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు మరియు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే మెస్ ఛార్జీలను భారీగా పెంచారని తెలిపారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థను నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వినియోగించుకుని, క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది కామటి అరుణతో పాటు విద్యార్థినులు చైత్ర, కొనతం భవాని, సరబోజు రితిక, కమ్మగాని మధుప్రియ, దీక్షిత, కాటన్ మను, గుడిపాటి సిరి, సంపద తదితరులు పాల్గొన్నారు.