రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశాం.. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
ప్రతినిధి: హైదరాబాద్
ప్రచురణ: 27 Jul 2026 05:20 PM
వీక్షణలు: 33 Views
»»» తమ సంస్థ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేసింది
»»» ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది
»»» తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులు వేసినవే
»»» తనకు దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది - ఏవీ రంగనాథ్
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ సంస్థ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేసిందని, చెరువులను మరియు ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని ఆయన గుర్తుచేశారు. అలాగే దాదాపు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. వేల ఎకరాల కబ్జా భూములను వెనక్కి తీసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించామని, అదేవిధంగా లోతుకుంట ప్రాంతంలో భూకబ్జా యత్నాన్ని కూడా విజయవంతంగా అడ్డుకున్నామని పేర్కొన్నారు. అయితే ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన రంగనాథ్, తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులు వేసినవేనని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనకు దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎడిషన్తేదీ: 20-09-2026డిజిటల్ ఈ-పేపర్ క్లిప్
రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశాం.. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్):
»»» తమ సంస్థ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేసింది »»» ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది»»» తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులు వేసినవే»»» తనకు దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది - ఏవీ రంగనాథ్ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ సంస్థ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేసిందని, చెరువులను మరియు ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని ఆయన గుర్తుచేశారు. అలాగే దాదాపు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. వేల ఎకరాల కబ్జా భూములను వెనక్కి తీసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించామని, అదేవిధంగా లోతుకుంట ప్రాంతంలో భూకబ్జా యత్నాన్ని కూడా విజయవంతంగా అడ్డుకున్నామని పేర్కొన్నారు. అయితే ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన రంగనాథ్, తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులు వేసినవేనని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనకు దేశ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.