Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
జాతీయం బ్రేకింగ్

విద్యార్థులు, యువతపై జరిపిన లాఠీఛార్జ్ పట్ల ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 21 Jul 2026 07:39 PM
విద్యార్థులు, యువతపై జరిపిన లాఠీఛార్జ్ పట్ల ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులు, యువతపై లాఠీఛార్జ్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మంగళవారం ఈ అంశంపై పార్లమెంట్ స్తంభించింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీఛార్జ్‌లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టాయి. దీంతో సభలు వాయిదాల పర్వం కొనసాగాయి. దేశ రాజధానిలో సిజెపి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించి ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి తీసుకొచ్చారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా నియమం 377 ప్రకారం, సభ్యులు తమ తమ స్థానాలలో కూర్చొని, సభా కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను నాలుగు నిమిషాల్లోనే బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే సీను కొనసాగింది. సభను ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాలని అన్నారు. "పేపర్ లీక్‌లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న మన విద్యార్థులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగించి దాడి చేశారు. వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారి సమస్యలను వినాలి" అని ఖర్గే అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు లేచి కేకలు వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను ఏడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో ఛైర్మన్ సభను ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ఒక్క నిమిషంలోనే సభను బుధవారానికి వాయిదా వేశారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 22-07-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

విద్యార్థులు, యువతపై జరిపిన లాఠీఛార్జ్ పట్ల ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు

news image
హైదరాబాద్, Jul 22 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులు, యువతపై లాఠీఛార్జ్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మంగళవారం ఈ అంశంపై పార్లమెంట్ స్తంభించింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీఛార్జ్‌లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టాయి. దీంతో సభలు వాయిదాల పర్వం కొనసాగాయి. దేశ రాజధానిలో సిజెపి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించి ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి తీసుకొచ్చారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా నియమం 377 ప్రకారం, సభ్యులు తమ తమ స్థానాలలో కూర్చొని, సభా కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను నాలుగు నిమిషాల్లోనే బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే సీను కొనసాగింది. సభను ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాలని అన్నారు. "పేపర్ లీక్‌లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న మన విద్యార్థులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగించి దాడి చేశారు. వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారి సమస్యలను వినాలి" అని ఖర్గే అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు లేచి కేకలు వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను ఏడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో ఛైర్మన్ సభను ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ఒక్క నిమిషంలోనే సభను బుధవారానికి వాయిదా వేశారు.