Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

విద్యా రంగంలో అపూర్వ విజయం – ఘన సన్మానం

ప్రతినిధి: Chief Editor
ప్రచురణ: 20 Jul 2026 06:23 AM
విద్యా రంగంలో అపూర్వ విజయం – ఘన సన్మానం
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (కొత్తపేట): పదవ తరగతి ఫలితాల్లో మెరిట్ మార్కులు సాధించి, తన పేరుకు తగ్గట్టుగానే అక్షర జ్ఞానంతో అద్భుత విజయాన్ని అందుకున్న రొడ్డ అక్షరను ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఘనంగా సత్కరించింది. కొత్తపేటలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అక్షరతో పాటు, ఆమె ఉన్నత విజయానికి కారణమైన తల్లిదండ్రులను కూడా సంఘం ప్రతినిధులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన అక్షర ప్రతిభను నేతలు కొనియాడారు. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (PPL) వ్యవస్థాపక అధ్యక్షులు మచ్చ నరసన్న మార్క్స్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మామిడి పూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి, అతిధులుగా పోలీస్ ఇన్స్పెక్టర్ నాగమల్లు, చైతన్యపురి పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు మరియు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
హైదరాబాద్ ఎడిషన్ తేదీ: 22-07-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

విద్యా రంగంలో అపూర్వ విజయం – ఘన సన్మానం

news image
హైదరాబాద్ , Jul 22 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (కొత్తపేట): పదవ తరగతి ఫలితాల్లో మెరిట్ మార్కులు సాధించి, తన పేరుకు తగ్గట్టుగానే అక్షర జ్ఞానంతో అద్భుత విజయాన్ని అందుకున్న రొడ్డ అక్షరను ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఘనంగా సత్కరించింది. కొత్తపేటలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అక్షరతో పాటు, ఆమె ఉన్నత విజయానికి కారణమైన తల్లిదండ్రులను కూడా సంఘం ప్రతినిధులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన అక్షర ప్రతిభను నేతలు కొనియాడారు. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (PPL) వ్యవస్థాపక అధ్యక్షులు మచ్చ నరసన్న మార్క్స్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మామిడి పూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి, అతిధులుగా పోలీస్ ఇన్స్పెక్టర్ నాగమల్లు, చైతన్యపురి పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు మరియు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.